చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

ఈ మధ్యనే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్లలో భాగంగా కర్నూల్ లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో స్టేజ్ పైకి ఎక్కి డాన్స్ చేశాడు. గతంలో మహేష్ ఇలా ఎప్పుడూ చేయలేదు. నిజానికి ఒకప్పుడు ప్రమోషన్లకు కూడా మహేష్ బాబు వచ్చేవాడు కాదు. తన సినిమా ఈవెంట్లకి కూడా చాలా దూరంగా ఉండేవాడు. అలాంటి మహేష్ ఈ మధ్య కాలంలో తన సినిమాలను ప్రమోట్ చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆ విషయం గురించి నిన్న మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన సినిమా ‘ పక్కా కమర్షియల్’ మీడియా సమావేశంలో ప్రస్తావించాడు. ఇప్పుడు థియేటర్ల పరిస్థితి, నిర్మాతల పరిస్థితి ఏమాత్రం బాగోలేదని… ఓ సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లి థియేటర్ కు రప్పించడం చాలా కష్టమైపోయింది అని ఆయన చెప్పుకొచ్చారు. ‘మా లాంటి వాళ్ళు చెప్పినంత మాత్రాన జనం సినిమాకి రారని.. హీరో, హీరోయిన్లు తమ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటేనే జనాలు థియేటర్ కు వస్తారని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ మధ్యనే ఓ పెద్ద హీరో స్టేజి పై డ్యాన్స్ చేశాడు. తన సినిమా ప్రమోషన్ కోసం. అందరు హీరోలు మహేష్ లా ఉండాలని పరోక్షంగా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. అయితే మహేష్ మాత్రమే కాదు సినిమా ప్రమోషన్లలో భాగంగా చాలా మంది హీరోలు స్టేజ్ పై డాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి.పలు అవార్డుల ఫంక్షన్లో, వజ్రోత్సవం వంటి ఈవెంట్ లో కాకుండా.. సినిమా ప్రమోషన్లో భాగంగా స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోలు ఎవరో… ఓ లుక్కేద్దాం రండి :

1) ప్రభాస్ : దశరథ్ దర్శకత్వంలో చేసిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’, కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘మిర్చి’ వంటి చిత్రాల ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ స్టేజ్ పై డాన్స్ చేశాడు. ‘సాహో’ ప్రమోషన్లలో భాగంగా సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ తో కూడా కలిసి డాన్స్ చేశాడు.

2) అల్లు అర్జున్ : బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘సరైనోడు’ ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్ స్టేజ్ పై డ్యాన్స్ చేశాడు.

3) రామ్ : త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో చేసిన ‘హలో గురు ప్రేమ కోసమే’ ప్రమోషన్లలో భాగంగా రామ్ స్టేజ్ పై డాన్స్ చేశాడు.

4) చిరు, సాయి పల్లవి : నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చిరు, సాయి పల్లవి స్టేజ్ పై డాన్స్ చేశారు.

5) రాంచరణ్, కీర్తి సురేష్ : ‘గుడ్ లక్ సఖి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రాంచరణ్… కీర్తి సురేష్ తో కలిసి స్టేజ్ పై డాన్స్ చేశారు.

6) సల్మాన్(ఎన్టీఆర్, చరణ్) : ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్, చరణ్, అలియా భట్ లతో కలిసి సల్మాన్ ఖాన్ స్టేజ్ పై డాన్స్ చేశారు.

7) ఆమిర్ ఖాన్(ఎన్టీఆర్, చరణ్) : ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్, చరణ్, అలియా భట్ లతో కలిసి ఆమిర్ ఖాన్ స్టేజ్ పై డాన్స్ చేశారు

8) ఎన్టీఆర్ : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఊసరవెల్లి’, మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ‘శక్తి’ సినిమాల ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్.. స్టేజ్ పై డాన్స్ చేశారు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం కూడా చాలా సార్లు స్టేజ్ పై డాన్స్ చేశాడు.

9) నాగార్జున : ‘దేవదాస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా నాగార్జున స్టేజ్ పై డాన్స్ చేశాడు. అంతకు ముందు ‘కింగ్’ వంటి చిత్రాల ప్రమోషన్లలో భాగంగా కూడా స్టేజ్ పై డాన్స్ చేశాడు నాగ్.

10) వరుణ్ తేజ్ : ‘ఎఫ్3’ చిత్రం ప్రమోషన్లలో భాగంగా వరుణ్ స్టేజ్ పై డాన్స్ చేయడం జరిగింది.

11) వెంకటేష్ : ‘ఎఫ్3’ చిత్రం ప్రమోషన్లలో భాగంగా వెంకటేష్ కూడా స్టేజ్ పై డాన్స్ చేశారు.

12) నాని : ‘దేవదాస్’, ‘నేను లోకల్’ చిత్రాల ప్రమోషన్లలో భాగంగా నాని స్టేజ్ పై డాన్స్ చేశారు.

13) రవితేజ : పవర్, కిక్ 2,రాజా ది గ్రేట్.. చిత్రాల ప్రమోషన్లలో భాగంగా రవితేజ స్టేజి పై డాన్స్ చేశారు.

14) బాలకృష్ణ : శ్రీమన్నారాయణ, పైసా వసూల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టేజి పై డాన్స్ చేశారు బాలయ్య.

15) మహేష్ బాబు : ‘సర్కారు వారి పాట’ చిత్రం సక్సెస్ మీట్లో ‘మ మ మహేషా’ పాటకి స్టేజ్ పై డాన్స్ చేశాడు.

16) అనుపమ పరమేశ్వరన్‌

17) ప్రభాస్, అనుష్క

Share.