తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకొచ్చిన హాస్యనటుడు ప్రియదర్శి. పిచ్చి పిచ్చి పనులు చేస్తేనే హాస్యం వస్తుందనే మాటను బీట్ చేస్తూ.. తనదైన డైలాగ్స్ తో నవ్వులు పూయించారు. చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్న ప్రియదర్శి, రిచా శర్మ అనే అమ్మాయిని ప్రేమించి.. పెళ్లిచేసుకున్నారు. రెండు కుటుంబాలవారు వీరి ప్రేమని గౌరవించి దగ్గరుండి ఈనెల 23న ఆగ్రాలోని గ్రాండ్ హోటల్ లో వైభవంగా కళ్యాణం జరిపించారు. ఇక మిత్రుల కోసం రిసెప్షన్ ని నిన్న (ఫిబ్రవరి 26 ) హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బంధు, మిత్రులతో పాటు సినిమా ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ముఖ్యంగా పెళ్లి చూపులు టీమ్ రిసెప్షన్ లో సందడి చేసింది. అనేక సినిమాలకు సైన్ చేయడం వల్ల ప్రియదర్శి ఎక్కువ రోజులు హనీమూన్ ఎంజాయ్ చేయడం లేదని తెలిసింది. మరో వారం రోజుల్లో సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. ప్రియదర్శి మంచి నటుడు మాత్రమే కాదు.. అందగాడు కాబట్టి అతనితో హీరోగా సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు క్యూలో ఉన్నట్టు టాక్. అయితే తాను మాత్రం నటుడిగా విభిన్న పాత్రలు పోషించడానికి సిద్ధమే కానీ.. హీరోగా చేయనని స్పష్టం చేసినట్లు ఫిలిం నగరవాసులు చెప్పుకుంటున్నారు.