అడల్ట్ కంటెంట్ ఎక్కువైంది.. కాజల్!

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం ‘క్వీన్’. ఈ చిత్రంలో కంగనా నటనకి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రాన్నిసౌత్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగులో తమన్నా హీరోయిన్ గా ‘దటీజ్ మహాలక్ష్మి’ పేరుతో రూపొందగా తమిళ్ లో కాజల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికి ‘పారిస్ పారిస్’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. రమేష్ అరవింద్ వర్మ దర్శకుడు.

అయితే ఈ చిత్రానికి సెన్సార్ ఇబ్బందుల్లో ఏర్పడ్డాయట. ఇటీవల ఈ చిత్రం చూసిన సెన్సార్ అధికారులు సినిమాకి ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. అంతేకాదు సినిమాలో చాలా వరకూ ఆడియో, వీడియో కట్స్ సూచించడంతో యూనిట్ కు పెద్ద షాకే తగిలిందని చెప్పాలి. చెప్పాలంటే టీజర్ చూసినప్పుడే ఇందులో ‘అడల్ట్ కంటెంట్’ ఎక్కువ ఉంటుందని చాలా మంది కామెంట్స్ చేసారు. తమిళ్ మినహియిస్తే… మిగిలిన భాషల్లో విడుదల చేసిన టీజర్లు డీసెంట్ గానే ఉన్నాయి. ‘పారిస్ పారిస్’ టీజర్ లో కాజల్ వక్షభాగాన్ని మరోనటి పట్టుకోవడం పెద్ద సంచలనమయ్యింది. అంతేకాదు ఈ చిత్రంలో అలాంటి సన్నివేశాలు, బూతు డైలాగులు ఇంకా చాలా ఉన్నాయట. మిగిలిన భాషల్లో కూడా సినిమాను బోల్డ్ గా తీయాలనే నిర్మాతలు భావించినా దానికి హీరోయిన్లు అభ్యంతరం చెప్పడంతో డీసెంట్ గా తెరకెక్కించారు. అయితే మన కాజల్ మాత్రం ఎటువంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో సినిమా కాస్త బోల్డ్ గా తీసారట. అయినా సెన్సార్ సభ్యులు మాత్రం ఆ బోల్డ్ నెస్ కు బ్రేక్స్ వేశారు. దీంతో ఈ చిత్ర యూనిట్ సభ్యులు.. సెన్సార్ వారి పై ఆగ్రహంతో ఉన్నారట. దీంతో రివ్యూ కమిటీని ఆశ్రయించే పనిలో కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus