మెగాస్టార్ చిరంజీవి వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో తన దూకుడును కొనసాగిస్తున్నారు. వరుస విజయాలతో అభిమానులను ఉత్సాహపరుస్తున్న ఆయన, ప్రస్తుతం భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఫాంటసీ ఎపిక్ ‘విశ్వంభర’ పై అందరి దృష్టి నెలకొంది. మొదట విడుదలైన టీజర్‌కు మిక్స్‌డ్ స్పందన వచ్చినా, చిత్ర బృందం వెనక్కి తగ్గకుండా విజువల్స్‌ను మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. రీషూట్స్, సీజీ వర్క్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో సినిమా విడుదల తేదీని జూలై 10కి ఖరారు చేశారు.
ఈ సినిమాపై అంచనాలను తాజాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పెంచేశాయి. ఓ సినిమా సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ, ‘విశ్వంభర ట్రైలర్ చూశాక పూర్తిగా వేరే ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్ వచ్చింది. ఇప్పటివరకు బయటకు వచ్చిన దానికంటే అసలు కంటెంట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఈ ఏడాది విడుదలయ్యే చిత్రాలతో UV క్రియేషన్స్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ బ్యానర్‌గా నిలుస్తుంది’ అని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఈ సినిమా బిజినెస్ స్థాయి తన సామర్థ్యాన్ని మించిందని, భారీ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతోందని కూడా పేర్కొన్నారు.
దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, సురభి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ధీరజ్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో, ఇప్పుడు మెగా అభిమానులంతా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూలై 10న ‘విశ్వంభర’ ఏ స్థాయి ఫలితం రాబడుతుందో చూడాలి..