‘సాహో’ కి షాకిచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులు..!

  • August 21, 2019 / 06:13 PM IST

‘సాహో’ మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రం గురించి రోజు రోజుకి ఆసక్తిని పెంచేలా ఓ అప్డేట్ బయటకి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సాహో’ మేనియానే….! యంగ్ రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకుందని సమాచారం.

అయితే ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. దీనికి అసలు కారణం… సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ‘ఏ’ సర్టిఫికేట్ ను జారీ చేశారట.. వారు చెప్పిన కొన్ని మార్పులు చేస్తే యు/ఏ సర్టిఫికేట్ ను ఇస్తామని చెప్పారట. ‘ఏ’ సర్టిఫికేట్ గనుక తీసుకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. 18 ఏళ్ళ వయసున్న పిల్లలు అప్పుడు సినిమా చూడడానికి వీలుండదు. దీంతో సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ‘యు/ఏ’ ఇస్తే ఎలాంటి సమస్య ఉండదు. అందుకే కట్స్, మ్యూట్స్ లేకుండా యు/ఏ వచ్చేలా నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారట. మరో పది రోజుల్లో రిలీజ్ ఉండడంతో ఇదో సమస్య ఏర్పడిందని తెలుస్తుంది. సెన్సార్ కి సంబంధించిన అప్డేట్ ఈరోజు లేదా రేపు వచ్చే అవకాశం ఉందట. ఇక సినిమా రన్ టైం 2 గంటల 52 నిమిషాలు వరకూ ఉందట. మరి ఫైనల్ కట్ లో ఎంతవరకూ వస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus