Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

  • July 13, 2026 / 04:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

సినిమా – సెన్సార్‌.. ఈ రెండింటి మధ్య ఎలాంటి బంధం ఉందో అందరికీ తెలుసు. సెన్సార్‌ అయితే కానీ సినిమా బయటకు రాదు. దీని కోసం కేసులు, కోర్టులు, చర్చలు.. వామ్మో పెద్ద కథే నడుస్తోంది ఈ మధ్య. ఇన్నాళ్లూ ఈ ఝంఝాటం వెండితెరకు మాత్రమే ఉండింది. ఆ తర్వాత కొన్ని రోజులకు టీవీలకు కూడా వర్తింపజేశారు. థియేటర్ల కోసం సెన్సార్‌ చేసిన సినిమాను.. టీవీల్లో యథాతథంగా వేయడం లేదు. అయితే యూ, యూ/ఎ ఉంటే వేసేయొచ్చు అనుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్‌ ఓటీటీలకు కూడా వర్తించబోతోంది అని సమాచారం.

OTT Films

అవును, మీరు చదివింది నిజమే. ఆర్జీవీ లాంటి సినిమా దర్శకులు ‘ఓటీటీకి సెన్సార్‌ లేదు కదా..’ అంటూ తమకు నచ్చినట్లుగా సినిమా తీసేసి.. నచ్చితే చూడండి లేకపోతే లేదు అని చెప్పిన రోజులు మనం చూశాం. ఇంకొన్నయితే ప్రజలకు నిజాలు చెప్పాలనుకుని.. సెన్సార్‌ దగ్గర ఆగిపోతున్నాయి. అలాంటి నేరుగా ఓటీటీకి వచ్చి.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తే ఆగిపోతున్నాయి. మొన్నీమధ్య ‘సత్లుజ్‌’ సినిమా అలా ఆగిపోయిందే.

ఈ చర్చ ఇంకా నడుస్తున్న ఈ సమయంలో ఇప్పటివరకూ వెండితెరపై విడుదలయ్యే సినిమాలకు మాత్రమే ఉన్న సెన్సార్‌ నిబంధన ఇకపై ఓటీటీ సినిమాలకూ వర్తించేలా కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ప్రస్తుత చట్టాల ప్రకారం ఓటీటీ కంటెంట్‌ను ఐటీ నిబంధనలు – 2021 ప్రకారం నియంత్రిస్తారు. ఈ కంటెంట్‌కు సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ అవసరం లేదు. దీంతో సెన్సార్ నిరాకరించిన, వివాదాస్పదమైన చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

నిబంధనలను సవరించి, ఓటీటీ చిత్రాలకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ను జారీ చేసే ఆలోచన చేసిందని టాక్‌. సినిమాలకు మాత్రమే కాకుండా, వెబ్ సిరీస్‌లను కూడా సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ అంశంపై సమాలోచనలు, అభిప్రాయ సేకరణలు చేయాలని చూస్తున్నారట. దిల్జీత్‌ సింగ్‌ దొసాంజ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్లుజ్’ సినిమా వివాదాస్పదమైంది. ఆ సినిమాకు సెన్సార్‌ బోర్డు భారీ కట్స్‌ సూచించడంతో చిత్రబృందం కట్స్ చేయకుండా ఓటీటీలోకి విడుదల చేసింది. అయితే రెండు రోజుల్లోనే ఓటీటీ నుండి సినిమాను తొలగించేశారు.

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

11 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

13 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

6 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

7 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

8 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version