Chaavu Kaburu Challaga: ఆహా లో చావు కబురు చల్లగా… ఇక్కడ హిట్ చెయ్యాలని నిర్మాతల ప్రయత్నాలు…!

Advertisement

ఆర్.ఎక్స్.100 హీరో కార్తికేయ నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ చావు కబురు చల్లగా.! జి.ఎ2.పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్ళ పాటి డైరెక్ట్ చేశాడు. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. రిలీజ్ కు ముందు ఈ సినిమా అంత కాదు.. ఇంత కాదు అంటూ డప్పు కొట్టారు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ అయితే.. చావు కబురు చల్లగా సినిమా ఓ ఎపిక్, క్లాసిక్ అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు.

నటీనటులు అందరినీ పిలిచి వాళ్ళ కెరీర్లో ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నట్టు ప్రశంసలు కురిపించాడు. కానీ సినిమా మాత్రం ఆ స్థాయిలో ఏ మాత్రం లేదు. అయితే ఈ ఫ్లాప్ సినిమా గురించి ఇప్పుడు ఇంత డిస్కషన్ ఎందుకు అంటారా? ఏప్రిల్ 23 న ఈ చిత్రాన్ని ఆహా ఓటిటి లో విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం స్పెషల్ గా ఓ వేడుకను కూడా ఏర్పాటు చేసి మరీ ప్రమోట్ చేస్తున్నారు. ఈ వేడుకలో కూడా ఈ సినిమా గురించి తెగ డబ్బా కొట్టేశారు.

పైగా ఓటిటి విడుదల కోసం ఈ సినిమాలో మళ్లీ మార్పులు చేశాం అంటూ చెప్పుకొస్తున్నారు ఈ చిత్ర యూనిట్ సభ్యులు. అయినా అయిపోయిన పెళ్లికి బాజాల అన్నట్టు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు ఇంత హడావిడి చేస్తున్నారు ఎందుకు..? అది కూడా మళ్లీ ఖర్చు పెట్టి .. అనే అనుమానాలు కూడా చాలా వ్యక్తమయ్యాయి. సినిమా లో బడ్జెట్లో తీశారు కాబట్టి.. కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందేమో అనేమో..!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus