Chaavu Kaburu Challaga: ‘చావు కబురు చల్లగా’ టీమ్ హడావిడి!

  • April 22, 2021 / 05:24 PM IST

ఒక సినిమా విడుదలై దానికి ప్లాప్ టాక్ వస్తే.. ఇక దాని గురించి ఎక్కడా చర్చ ఉండదు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా రిలీజైన కొన్ని రోజుల వరకు ప్రమోషన్స్ నిర్వహిస్తారు. కానీ సినిమా థియేటర్ నుండి వెళ్లిపోతే ఇంకెవరూ పట్టించుకోరు. కానీ ‘చావు కబురు చల్లగా’ టీమ్ మాత్రం తమ సినిమా విడుదలైన నెల రోజుల తరువాత దాన్ని ప్రమోట్ చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. రిలీజ్ ముందు ఉన్న బజ్ కారణంగా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

కానీ సినిమా ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. వారం రోజులు కూడా ఈ సినిమా థియేటర్లో కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘ఆహా’లో రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ సినిమా యూనిట్ హడావిడి చేస్తుంది. థియేటర్లో డిజాస్టర్ అయిన ఏ సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుందని.. దానికోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. హీరో కార్తికేయ, దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ఇందులో పాల్గొని తమ సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ‘చావు కబురు చల్లగా’ సినిమా సరిగ్గా ఆడలేదనే విషయాన్ని ఒప్పుకున్న కార్తికేయ.. సినిమాకు ఓ వర్గం నుండి మాత్రం ప్రశంసలు దక్కాయని అన్నారు.

ఇప్పుడు సినిమాను మళ్లీ ఎడిట్ చేసి రిలీజ్ చేస్తున్నామని.. థియేటర్లో చూసిన దానికంటే ఈ వెర్షన్ మెరుగ్గా ఉంటుందని చెప్పారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి తెగ హడావిడి చేస్తున్నారు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎంత ప్రమోట్ చేసినా.. కంటెంట్ లేకపోతే వర్కవుట్ అవ్వదంటూ విమర్శలు చేస్తున్నారు. ‘ఆహా’లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అల్లు వారి సొంత సినిమా కావడంతో ఇంకా ప్రమోషన్స్ చేస్తూ.. జనాల్లో సినిమాను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus