తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వారు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయ కృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ గత రెండు దశాబ్దాల క్రితమే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కానీ ఈయన మాత్రం హీరో ఒక పెద్దగా సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి. చాలా రోజుల తర్వాత తనని తానే రీ ఎంట్రీ చేసుకుంటూ బ్రీత్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు నందమూరి ఫ్యామిలీలో జరిగినటువంటి వరస మరణాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఏదైనా శాపం వల్లే మీ కుటుంబంలో ఇలా వరుస మరణాలు జరుగుతున్నాయ అంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు చైతన్య సమాధానం చెబుతూ శాపం వల్ల కాదు కానీ కొన్నిసార్లు అనుకొని సంఘటనలు జరుగుతూ ఉంటాయని అలా మా ఫ్యామిలీలో కూడా జరిగాయని తెలిపారు.
బాబాయ్ హరికృష్ణ, జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, ఇటీవల తారకరత్న మరణించడం మా కుటుంబానికి తీవ్ర దుకాణాన్ని మిగిల్చాయని ఇప్పటికి వారి మరణ వార్త నుంచి బయటపడలేకపోతున్నామని తెలియజేశారు. ఇక జానకిరామ్ గురించి మాట్లాడుతూ ఈయనను ఎన్టీఆర్ మనవడు అంటే ఎవరు కూడా నమ్మేవారు కాదు అంత సింపుల్ గా ఉండే వ్యక్తి జానకిరామ్ అంటూ చైతన్యకృష్ణ తెలియజేశారు. ఇక తారకరత్న మరణం తనని ఎంతగానో కృంగదీసిందని, తాను నాతో ఎప్పుడూ సరదాగా ఉండేవారు
తనకు మొదటి కార్ నేనే తీసిచ్చాను డ్రైవింగ్ కూడా నేనే నేర్పించాను. తనని మేము ముద్దుగా ఓబులేసు అని పిలుచుకునే వాళ్ళము అంటూ చైతన్య కృష్ణ తెలియజేశారు. తారకరత్న కూడా ఎప్పుడు తన ఫ్యామిలీ పేరును ఉపయోగించుకొని పైకి ఎదగాలని ఆశించే వ్యక్తి కాదు ఎలాంటి గర్వం లేకుండా అందరితో సరదాగా ఉండే వారని తన మరణ వార్తను ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఈ సందర్భంగా చైతన్య కృష్ణ (Chaitanya Krishna) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.