Chalapathi Rao: ఇండస్ట్రీలో మరో విషాదం… నటుడు చలపతిరావు హఠాన్మరణం!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కైకాల సత్యనారాయణ మరణ వార్త నుంచి ఇంకా బయటపడక ముందే మరొక నటుడు కన్నుమూశారు. ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి చలపతిరావు గుండెపోటు సమస్యతో నేడు తెల్లవారుజామున మరణించారు.

చలపతిరావు అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. అయితే నేడు తెల్లవారుజామున ఈయనకు గుండెపోటు రావడంతో మరణించినట్లు తెలియజేశారు. కృష్ణాజిల్లా బల్లిపర్రులో జన్మించిన చలపతిరావుకు ఒక కుమారుడు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈయన కుమారుడు నటుడు దర్శకుడు రవిబాబు ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇక చలపతిరావు కూడా ఎన్నో సినిమాలలో నటుడిగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈయన తన సినీ ఇండస్ట్రీలో సుమారు 1200 కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. ఇక ఈయన ఏడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

ఇక ఈయన గూడచారి 116 సినిమా ద్వారా వెండి తెర ఎంట్రీ ఇచ్చారు. చలపతిరావు చివరిగా ఓ మనిషి నీవెవరు అనే సినిమాలో నటించారు. ఇక ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ సెలబ్రెటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus