Chandra Mohan: చంద్రమోహన్ కు వారసులు లేరా.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

  • November 11, 2023 / 09:05 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు చంద్రమోహన్ ఒకరు. హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసినటువంటి చంద్రమోహన్ నేడు ఉదయం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోనే అపోలో హాస్పిటల్లో మరణించారు. చంద్రమోహన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన నేపథ్యంలో ఈ విషయం తెలిసి చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఎంతో మంది సీనియర్ నటీనటులు చంద్రమోహన్ తో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేయడమే కాకుండా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఈ విధంగా చంద్రమోహన్ మరణించడంతో ఆయనకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రమోహన్ భార్య పిల్లల గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే చంద్రమోహన్ కి వారసులు లేరు అనే సంగతి తెలిసిందే.

ఇద్దరు కుమార్తెలు కావటం విశేషం. చంద్రమోహన్ భార్య పేరు జలంధర ఈమె ప్రముఖ రచయిత్రి. ఇప్పటికే ఎన్నో కవితలు నవలలు రాసి రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈయన భార్య రచయితగా గుర్తింపు పొందగా ఈయన కుమార్తెలు ఇద్దరు కూడా డాక్టర్స్ కావడం విశేషం. పెద్ద కుమార్తె పేరు మధుర మీనాక్షి ఈమె అమెరికాలో సైకాలజిస్ట్ గా స్థిరపడ్డారు.

ఇక రెండవ కుమార్తె పేరు మాధవి ఈమె కూడా చెన్నైలో డాక్టర్ గా పని చేస్తున్నారు. ఇలా తన పిల్లలు ఇద్దరు కూడా జీవితంలో మంచిగా స్థిర పడ్డారు. ఇక ఈయన పెద్ద కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తరువాతనే చంద్ర మోహన్ (Chandra Mohan) అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus