సర్కారు వారి పాట.. మళ్ళీ ప్లాన్ చేంజ్ అయ్యింది

Advertisement

మహేష్ బాబు సర్కారు వారి పాట కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నెలలు గడిచాయి. లాక్ డౌన్ మొదటి నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన షెడ్యూల్స్ లో చాలా ప్లాన్స్ మారాయి. సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేద్దామని అనుకున్న చివరి వారంలో ఎదో అలా కారణం వల్ల వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో షూటింగ్స్ షెడ్యూల్స్ ను ఎక్కువగా మార్చింది సర్కారు వారి పాట టీమే అని చెప్పాలి. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమా మొదటి షెడ్యూల్ అనుకున్న ప్లాన్ ప్రకారం అమెరికాలో మొదలవ్వాలి.

అసలు షూటింగ్ స్టార్ట్ అవుతుందా లేదా అని అభిమానుల్లో ఎన్నో అనుమానాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక ఫైనల్ గా మళ్ళీ హైదరాబాద్ లో స్టార్య్ చేస్తారని అన్నారు. అది కూడా కుదరలేదు. మొత్తానికి ఇప్పుడు దుబాయ్ లోనే మొదటి షెడ్యూల్ ను ఫిక్స్ చేశారు. దాదాపు 25రోజుల పాటు షెడ్యూల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మహేష్ బాబుతో పాటు మరికొందరు సీనియర్ యాక్టర్స్ ఆ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

దుబాయ్ షెడ్యూల్ అనంతరం దర్శకుడు పరశురామ్ మళ్ళీ హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నాడు. ప్రత్యేకంగా ఏర్పటు చేసిన సెట్స్ లలోనే సినిమా షూటింగ్ ను కొనసాగించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news