Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Charmee Kaur: అడ్డంగా దొరికిన ఛార్మి… చరణ్‌ ఫ్యాన్స్‌ ఏం చేస్తున్నారంటే?

Charmee Kaur: అడ్డంగా దొరికిన ఛార్మి… చరణ్‌ ఫ్యాన్స్‌ ఏం చేస్తున్నారంటే?

  • August 26, 2022 / 03:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Charmee Kaur: అడ్డంగా దొరికిన ఛార్మి… చరణ్‌ ఫ్యాన్స్‌ ఏం చేస్తున్నారంటే?

రోజులన్నీ మనవి కావు.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు నవ్వుతామో, ఎప్పుడు నవ్వులపాలవుతామో అస్సలు తెలియదు. అందుకే తమదికాని సమయంలో నవ్వి ఆ తర్వాత ఇబ్బందులు పడకూడదు అని అంటుంటారు. ఎందుకీ వేదాంతం, ఎవరి గురించి ఈ మాటలు అంటారా? ఈ మాటలు మేం అనడం లేదు. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఎవరి గురించి అంటారా? అతి నమ్మకంతో రూ. 200 కోట్ల డీల్‌ను వదులుకున్న డేరింగ్‌ ప్రొడ్యూసర్‌ ఛార్మి గురించి.

‘లైగర్‌’ సినిమా పరాజయంతో అసలే బాధలో ఉన్న పూరి జగన్నాథ్‌, ఛార్మి టీమ్‌కి సోషల్‌ మీడియా పుండు మీద కారం చల్లుతున్నట్లుగా కొన్ని మీమ్స్‌, జోక్స్‌, సెటైర్లు, కౌంటర్స్‌ ఇబ్బంది పెడుతున్నాయి. అందులో చాలావరకు స్వయంకృతాపరాధమే అని చెప్పాలి. అంటే.. వాళ్లు గతంలో చేసిన కొన్ని పనులే వారిని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. అసలు రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు ఎందుకు ఛార్మిని ట్రోల్‌ చేస్తున్నారు అనేగా మీ ప్రశ్న. ఈ విషయంలో మీకు తెలియాలంటే ట్విటర్‌లో ఛార్మి ప్రొఫైల్‌ని ఏడేళ్లు వెనక్కి స్క్రోల్‌ చేయాలి.

అయితే మీకు అంత కష్టం లేకుండా మేమే ఆ ట్వీట్, ఆ విషయం చెబుతాం. రామ్‌చరణ్‌ ‘బ్రూస్‌లీ’ సినిమా విడుదలైన రోజున ఛార్మి ఓ ట్వీట్‌ చేసింది. అందులో మొత్తం నవ్వుతున్న ఎమోజీలు, చప్పట్లు కొట్టిన ఎమోజీలే ఉన్నాయి. ఆమె ఎందుకలా ట్వీట్‌ చేసింది అనేది అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. అయితే ‘బ్రూస్‌లీ’ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ఛార్మి అలా ట్వీట్‌ చేసింది అని రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. దానికి ఇప్పుడు ‘లైగర్‌’ ఫలితం సమాధానం ఇచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

‘బ్రూస్‌లీ’ సినిమాకు ముందు చిరంజీవి – పూరి జగన్నాథ్‌ల ‘ఆటో జానీ’ సినిమా ఓకే అయినట్లే అయ్యి.. ఆగిపోయింది. చిరు రీఎంట్రీ ఆ సినిమాతోనే అనుకున్నప్పటికీ కుదర్లేదు. ఈలోపు రీఎంట్రీకి టీజర్‌లా ఉంటుంది అని ‘బ్రూస్‌లీ’లో నటించారు చిరు. అయితే ఆ సినిమా ఫట్‌ మనడంతో అభిమానులు బాగా నిరాశకు గురయ్యారు. అదే సమయంలో ఛార్మి అలా ట్వీట్‌ చేయడంతో అభిమానులకు బాగా కాలింది. అయితే అప్పట్లో ట్రోలింగ్‌, గీలింగ్‌లు లాంటివి లేవు. దీంతో ఇప్పుఉ ‘లైగర్‌’ ఫలితం తర్వాత ఛార్మి ట్వీట్‌ కింద ఆట మొదలుపెట్టారు.

😂😂😂😂😂😂😂👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

— Charmme Kaur (@Charmmeofficial) October 16, 2015

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Charmee Kaur
  • #Actress Charmee Kaur
  • #Charmee Kaur
  • #Liger
  • #Ram Charan

Also Read

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

32 mins ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

23 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

23 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

1 day ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

1 day ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

1 day ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

1 day ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version