ఛార్మీ పెళ్ళి వార్తల్లో నిజమెంత..?

‘నీతోడుకావాలి’ అనే తెలుగు చిత్రంతోనే తెరంగేట్రం చేసిన ఛార్మీ .. ఆ తరువాత శ్రీకాంత్ హీరోగా నటించిన ‘నీకే మానసిచ్చాను’ అనే చిత్రంలో కూడా నటించింది. అయితే అప్పటికి ఈ బ్యూటీని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ కృష్ణవంశీ డైరెక్షన్లో చేసిన ‘శ్రీ ఆంజనేయం’ చిత్రంలో ఓ రేంజ్ గ్లామర్ షో చేసి బాగా పాపులర్ అయ్యింది. ఆ చిత్రం హిట్ కాకపోయినా.. ఈమె గ్లామర్ షో వల్ల వరుస అవకాశాలు వచ్చాయి. అతి తక్కువ టైంలోనే ప్రభాస్,రవితేజ, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

‘మంత్ర’ ‘మంగళ’ ‘జ్యోతి లక్ష్మీ’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. కానీ తరువాత ఎందుకో సినిమాల్లో నటించడం మానేసి.. డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే పూరి జగన్నాథ్ తో ఛార్మీ రిలేషన్ షిప్ లో ఉందని ప్రచారం కూడా నడిచిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల రేంజ్లో వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం చూసి ఇది బహిరంగ రహస్యమే అని అంతా అనుకున్నారు.

కానీ ఈ వార్తలను ఛార్మీ ఖండిస్తూనే వచ్చింది. ‘పూరి తనకు మంచి స్నేహితుడు మాత్రమే’ అని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా ఇప్పుడు అమృత్ సర్ కు చెందిన ఓ వ్యక్తితో ఛార్మీ పెళ్ళి చేసుకోవడానికి ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ‘లాక్ డౌన్ కారణంగానే పెళ్ళి వాయిదా పడిందని లేకుంటే.. ఈపాటికి ఛార్మీ పెళ్ళైపోయేదని’ ఇన్సైడ్ టాక్. మరి ఈ ప్రచారంలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus