సింధు మీనన్ ను ఇండియాకి రప్పించే పనిలో పోలీసులు.!

కన్నడ నటి సింధు మీనన్ భద్రాచలం, చందమామ సినిమాలతో తెలుగు వారికి బాగా దగ్గరయింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసిన ఈ నటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని పెళ్లి చేసుకొని లండన్‌లో స్థిరపడింది. వివాహం అనంతరం మీడియాలో కనిపించని, వినిపించని ఈమె పేరు రెండు రోజులుగా ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకని వివరాల్లోకి వెళితే.. జుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్ఎంసీ యార్డ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి సింధు మీనన్ 36 లక్షల రుణం తీసుకున్నారు. ఆ తర్వాత తీసుకున్న అప్పును ఆమె చెల్లించలేదు.

చాలా రోజుల నుంచి రుణం చెల్లించకపోగా, నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చి మోసం చేశారని బ్యాంకు అధికారులు ఆమెపైనా, ఆమె సోదరుడు మనోజ్ కార్తికేయన్ పైనా బెంగళూరులోని ఆర్‌ఎంసీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సింధు సోదరుడు కార్తికేయన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసుపై సింధు మీనన్ కూడా అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఆమె విదేశాల్లో ఉన్న నేపథ్యంలో సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఆమెను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సింధు మీనన్ లండన్ నుంచే రుణాన్ని చెల్లిస్తారా ? లేకుంటే పోలీసుల ముందుకు హాజరవుతారా? అనేది త్వరలో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus