Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘క’ సినిమాతో రూ.50 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇక ‘బేబీ’ సినిమాతో ఆల్మోస్ట్ రూ.100 కోట్ల క్లబ్ కి దగ్గరగా వెళ్లారు నిర్మాత ఎస్ కె ఎన్, దర్శకుడు సాయి రాజేష్. ఈ ముగ్గురి కలయికలో ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా.. అది బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకం ఆడియన్స్ కి ఏర్పడటం సహజం. అందుకే ‘చెన్నై లవ్ స్టోరీ'(Chennai Love Story) పై మొదటి నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయని కూడా చెప్పొచ్చు.

Chennai Love Story

రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ కూడా సినిమాపై హైప్ పెంచింది. అందువల్ల ‘చెన్నై లవ్ స్టోరీ’ కి ధియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ మార్క్ ను తెలుసుకుందాం రండి :

నైజాం 5 cr
సీడెడ్ 2 cr
ఉత్తరాంధ్ర 3 cr
ఈస్ట్ 0.50 cr
వెస్ట్ 0.60 cr
గుంటూరు 0.80 cr
కృష్ణా 1.0 cr
నెల్లూరు 0.40 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 13.3 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5 cr
 ఓవర్సీస్ 0.60 cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 15.4 cr

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.15.4 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే.. బ్రేక్ ఈవెన్ అనేది కేక్ వాక్ అనే చెప్పాలి.

నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus