చిన్మయి గురించి మీకు తెలియని లైఫ్ సీక్రెట్స్

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ పాటలంటే అందరికీ ఇష్టం. కానీ ఆయనకు ఇష్టమైన గాయని చిన్మయి శ్రీ పాద. ఆమె మొదటి పాట “ఏ దేవి వరమో” ఎంతగా పాపులర్ అయిందో, అలాగే రోబో లో “కిలిమంజారో” పాట అందరికీ భలే నచ్చింది. అంతటి స్వీట్ స్వరం కలిగిన ఈమె దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె ఈ రోజు (సెప్టెంబర్ 10) పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిన్మయికి ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె గురించి ఆసక్తికర సంగతులు..

1. నంబర్ వన్ స్టూడెంట్తమిళనాడుకు చెందిన సంగీత బ్యాగ్రౌండ్ కలిగిన కుటుంబంలో చిన్మయి శ్రీపాద జన్మించారు. ఆమె తల్లి టి. పద్మసిని గొప్ప సంగీత కళాకారిణి. స్కూల్ లో చిన్మయి నంబర్ వన్ స్టూడెంట్. బీఏ సైకాలజీ పూర్తి చేశారు.

2. ఆరు భాషల్లో గానంతమిళంలో వందల పాటలు పాడిన చిన్మయి తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనే కాకుండా హిందీ, మరాఠీ లోను గీతాలను ఆలపించారు.

3. బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ప్రముఖ నటీమణులు భూమిక, సమీరా రెడ్డి, త్రిష, తమన్నా, నయన తార లకు డబ్బింగ్ చెప్పారు. “ఏమాయ చేశావె” ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ సమంతకు తొలి చిత్రం నుంచి తాజాగా వచ్చిన ”జనతా గ్యారేజ్” వరకు చిన్మయి గొంతును అరువు ఇచ్చారు. చిన్మయి వాయిస్ సమంతకు చక్కగా సూట్ అవుతుంది. ఏ మాయ చేసావే సినిమాకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయి నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పటివరకు 50 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు.

4. షో ప్రజెంటర్వేదికలపై తన పాటల ప్రదర్శనమివ్వడమే కాకుండా బుల్లి తెర పై సంగీత కార్యక్రమాల్లో చిన్మయి పాల్గొంటుంటారు. స్టార్ విజయ్ ఛానల్ లో ప్రసారమైన ఎయిర్ టెల్ సూపర్ సింగర్ షో కి ప్రజెంటర్ గా వ్యవహరించి అలరించారు.

5. రేడియో జాకీచిన్మయి గొంతుకు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఆమె మాటలను వినాలనే వారి కోసం రేడియో జాకీ గా అవతారమెత్తారు. ఆహా ఎఫ్ ఎం 91.9లో “ఆహా కాపీ క్లబ్” అనే బ్రేక్ ఫాస్ట్ షో ద్వారా చెన్నై వాసులకు ప్రతి రోజు గుడ్ మార్నింగ్ చెబుతుంటారు.

6. వాయిస్ ఓవర్పాటల కోసమే కాదు.. ప్రకటనల కోసం కూడా చిన్మయిని సంప్రదించే వారు ఎక్కువ. అందుకే ఆమె చెన్నై సిల్క్స్ (వివాహ పట్టు ), టాటా గోల్డ్ ప్లస్, హెడ్ అండ్ షోల్డర్స్, శ్రీ దేవి టెక్స్టైల్స్, సఫోల మసాలా ఓట్స్ వంటి ప్రకటనలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

7. నటనహీరోయిన్లకు పోటీ ఇవ్వగల అందం చిన్మయి సొంతం. అయినా నటించడం తన వల్ల కాదని స్పష్టంగా చెప్పే గాయని దీపం ఆయిల్ ప్రకటనలో నటించారు. ఒకే సారి నాలుగు భాషల్లో షూట్ చేశారు. ఆ యాడ్ దక్షిణాది రాష్టాల్లో ప్రసారమయింది. ఇదే చిన్మయి మొదటి, చివరి యాక్టింగ్.

8. సొంత యాప్తన పేరు మీద “చిన్మయి శ్రీ పాద ఆప్” ని విడుదల చేసి రికార్డ్ సృష్టించింది. ఒక గాయని పేరు మీద యాప్ రావడం ప్రపంచంలోనే తొలిసారి. ఈ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో లభ్యమవుతుంది.

9. సీరియల్ టైటిల్ సాంగ్స్సినిమాలో పాడుతున్నాను కదా.. చిన్న వాటికి జోలికి పోకూడదని చిన్మయి ఎప్పుడు అనుకోరు. వెండి తెర అయినా, బుల్లి తెర అయినా సమానంగా గీతాలను ఆలపిస్తారు. తెలుగులో ప్రతిఘటన, నాటకం వంటి ధారావాహికలకు, తమిళంలో 15 సీరియల్స్ కు టైటిల్ సాంగ్స్ పాడారు.

10. లవ్లీ లవ్ స్టోరీఅందాల రాక్షసి, శ్రీమంతుడు సినిమాలో నటించిన నటుడు రాహుల్ రవీంద్రను 2014, మే 5 న పెళ్లి చేసుకున్నారు. చిన్మయికి రాహుల్ రవీంద్ర తల్లి పెద్ద ఫ్యాన్. రాహుల్ అంటే చిన్మయి పేరెంట్స్ కి గౌరవం. మొదట ఇరు కుటుంబ పెద్దలు వీరిద్దరూ కలిసి జీవించాలని కోరుకుంటే.. ఆ తర్వాత ఒకరినొకరి మనసులు కలిసి ఒకటయ్యారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus