ఫోన్లు చేయవద్దని మీడియాని వేడుకున్న చిన్మయి

లైంగిక వేధింపుల గురించి ముందుగానే బయటికి చెబితే… అలా చేసిన వారిని శిక్షించే అవకాశం ఉంటుందని.. ఇంకొకరు అటువంటి పనులు చేయకుండా ఉంటారని సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమకు జరిగిన విషయాలను బయటపెట్టి చైతన్యం కలిగిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది లైంగిక వేధింపుల గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు. అలా స్పందించడం కూడా చిక్కులు తెచ్చి పెడుతాయని గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద విషయంలో జరిగింది. చిన్నప్పుడు తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాయని వెల్లడించింది. “8-9 ఏళ్ల వయస్సులో అమ్మతో కలిసి ఒక రికార్డింగ్‌ స్టూడియోకు వెళ్లాను. అక్కడ నేను నిద్రపోతున్నప్పుడు ఎవరో తడుముతున్నట్టు గుర్తించాను.

అలాగే 10-11 ఏళ్ల వయసప్పుడు డిసెంబర్‌ సంగీత కచేరీ చూస్తుండగా ఒక ముసలాయన నా తొడపై గిల్లాడు” అని గుర్తుచేసుకొని బాధపడింది. దాంతో చిన్మయితో ఇంటర్వ్యూలు తీసుకోవాలని వార్తా ఛానెళ్లు భావిస్తున్నాయి. కానీ చిన్మయి మీడియా నుంచి వచ్చే ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేయడంలేదు. దాంతో మీడియా వర్గాలు చిన్మయి తల్లికి పదే పదే ఫోన్లు చేస్తూ ఆమెను విసిగిస్తున్నారట. ఈ విషయాన్ని చిన్మయి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. “చెన్నైకు చెందిన మీడియా వర్గాలకు విన్నపం. మాటిమాటికీ మా అమ్మకు ఫోన్‌ కాల్స్‌ చేసి ఆమెను ఇబ్బందిపెట్టకండి. ఫోన్లు చేయడం మానుకోండి. ఆమె వయసు 69. మీ కారణంగా ఆమె ఒత్తిడికి గురవుతున్నారు. దయచేసి మా అమ్మకు ఫోన్‌ చేయకండి” అని వేడుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus