సమంత విజయంలో గాయని చిన్మయికి కొంత భాగముంది. సమంత నటించిన ఏ మాయ చేసావె, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం… తదితర చిత్రాలకు ఆమె డబ్బింగ్ చెప్పారు. అలా ప్రొఫిషినల్ ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్ గా మారారు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. సమంతలో గమనించిన కొన్ని విషయాలను చిన్మయి రీసెంట్ గా వెల్లడించింది. “సమంతకు పాత్రల ఎంపికలోనే కాదు.. ఫ్యాషన్‌లోనూ మంచి అభిరుచి ఉంది. సినిమా వేడుకలు, ఇంటర్వ్యూలు, సమావేశాల్లో.. విభిన్న లుక్‌లో కనిపించడం ఆమె స్పెషల్” అని అభినందించింది.
ఇంకా పెళ్లి నగల గురించి సమంత తనకి చెప్పిన సంగతులను ట్విట్టర్ వేదికపై పంచుకుంది. “సమంత అందరికీ ఇన్స్పిరేషన్. సామ్ తన పెళ్లి నగల ఎంపిక గురించి నాకు ఓ విషయం చెప్పింది. మెడకు ఒక్క నగ, జడకు ఒక్క నగ చాలు అంది. అంతేకాదు అందులో డైమండ్స్ ఉండకూడదని చెప్పింది. ఏ పెళ్లి కుమార్తె అయినా సులభంగా అనుకరించడానికి ఆమె లుక్ ఓ ఉదాహరణ. తను చెప్పే సలహాలు నాకు ఎంతో నచ్చుతాయి” అని చిన్మయి ఓనెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పింది. మహానటి సినిమా నుంచి సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది. రీసెంట్ గా చేసిన యూ టర్న్ లోను సమంత సొంత వాయిస్ తో ఆకట్టుకోనుంది.