బలిజ క్రియేషన్స్ పతాకంపై వేణు కుమార్ నిర్మాతగా విక్కీ దర్శకత్వం వహించి నటించిన చిత్రం చిన్నారి ఈ చిత్రంలో సంజనా పటేల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ముఖ్యపాత్ర పోషించింది శర్మ హీరోయిన్. ఈ చిత్ర టీజర్ ను ఆదివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్లో విడుదల చేశారు. ఈ వేడుకకు సీనియర్ నటీమణులు గీతాంజలి, రోజారమణి, కవిత, మరియు నటుడు తోటపల్లి మధు, తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ శివన్న, డైమండ్ రత్నం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మొదట గీతాంజలి మాట్లాడుతూ.. ఈ సినిమాకు నేను రెండు రోజులు వర్క్ చేసాను. టైటిల్ అద్భుతంగా ఉంది చిన్నారి పాత్రలో చేసిన సంజనా పటేల్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందిి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూస్తే భయమేస్తోంది. అలాంటి దుర్ఘటన నుంచి ఓ మంచి సబ్జెక్టును ఎంచుకుని విక్కీ ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమాలు పాప పాత్రను చూసి నాకు ఏడుపు ఆగలేదు. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. ఇలాంటి సినిమాతో పేరెంట్స్ కు ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. డైరెక్టర్ కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది.. అని అన్నారు.
నటి కవిత మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనను తీసుకొని ఒక మంచి సబ్జెక్ట్ తో సినిమా చేశాడు విక్కీ. ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి చిన్నారి అనే సినిమాను రూపొందించాడు దర్శకుడు. వీరందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
రోజారమణి మాట్లాడుతూ.. చిన్న ఫిలిమ్ అయినా మెసేజ్ ఇవ్వడం జరుగుతోంది. నేటి కాలంలో అమ్మాయిలు అర్ధరాత్రి కాదు మిట్టమధ్యాహ్నం కూడా రోడ్డుపై నడవలేని దుస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి టైమ్ లో చిన్నారి లాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాను తెరకెక్కించిన దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమా ద్వారానైనా ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ఇంత మంచి మెసేజ్ ఉన్న సినిమాను ప్రేక్షకులందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు.
శివన్న మాట్లాడుతూ.. అవేర్నెస్ ఉన్న ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలి. టెక్నికల్ వైజ్ గా ఇంకాస్త శ్రద్ధ చూపించి కమర్షియల్ హిట్ హిట్ ను సాధించేలా ప్లాన్ చేసుకోవాలని విష్ చేస్తున్నాను. ఈ చిన్నారి చిత్రంలో నటించిన నటీనటులందరూ.. ఎంతో ప్రతిభను కనబరిచారు. మంచి మెసేజ్ అన్న సినిమా కనుక అందరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.. అన్నారు.
హీరోయిన్ స్నేహ శర్మ మాట్లాడుతూ.. ఇంత మంచి సబ్జెక్టు లో నన్ను కూడా భాగం చేసినందుకు దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చిత్రంలో నటించిన వారందరూ బాగా ఇన్వాల్వ్ అయ్యి నటించారు. అందుకే సినిమా ఇంత బాగా వచ్చింది. కంగ్రాట్యులేషన్స్ 2 హోల్ టీం.. అని చెప్పారు.
ఇక ఈ చిత్ర దర్శకుడు మరియు హీరో విక్కీ మాట్లాడుతూ.. డైమండ్ రత్నం గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమా చేశాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ‘రిప్’ అని పెట్టి, ఒక్కరోజులోనే మరిచిపోతాం. అలా ఒకరోజు బాధపడితే మనం వారికి చేసే మేలు ఏమిటి..? అందుకే అన్యాయం జరిగిన అమ్మాయికి వారి కుటుంబానికి న్యాయం జరిగేలా నిందితుడికి శిక్షపడేలా చేయమంటూ తెలిపే చిత్రమే ఈ చిన్నారి సినిమా కథ. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాగా రూపొందించాము. ఈ చిత్రంలో సీనియర్ నటీనటులు నాపై నమ్మకంతో నటించారు. ఇక గీతాంజలి గారు అయితే కొన్ని సన్నివేశాలలో గ్లిజరిన్ లేకుండా.. సహజంగానే ఏడ్చేశారు. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని ఈ సినిమాను చేయడం జరిగింది. అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.