‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత రాంచరణ్ (Ram Charan) నుండి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game changer) నిరాశపరిచింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద నష్టాలే మిగిలాయి. ఈ సినిమా కోసం చరణ్ 3 ఏళ్ళు కష్టపడ్డాడు.సరైన అప్డేట్లు కూడా లేకుండా అభిమానులను చాలా ఇబ్బంది పెట్టాడు దర్శకుడు శంకర్ (Shankar). మరోపక్క రీషూట్లు వంటి వాటితో నిర్మాత దిల్ రాజు (Dil Raju) కూడా బాగా నలిగిపోయాడు.
అయితే ‘పెద్ది’ Peddi) గ్లింప్స్ వాటన్నిటినీ మరిపించింది. అలాగే ఈ సినిమాపై చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో రాంచరణ్ ‘పెద్ది’ గురించి మాట్లాడుతూ.. ” ‘రంగస్థలం'(Rangasthalam) ‘ఆర్.ఆర్.ఆర్’ కంటే కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఇది నేను సాధారణంగా అన్ని సినిమాలకి చెప్పను. కానీ ఇది మాత్రం మీరు కచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇప్పటికి షూటింగ్ 30 శాతం అయ్యింది. ఇంకా 70 శాతం మిగిలుంది.
అయినా సరే నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు. చరణ్ మాటల్ని బట్టి ‘పెద్ది’ పై అతనికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. మరోపక్క ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి, ‘జనసేన’ పార్టీ గురించి చెప్పాలని చరణ్ ను డిమాండ్ చేశారు అభిమానులు. అప్పుడు చరణ్.. ‘నేను చెబితే ఆ ఇంపాక్ట్ కొంచెమే ఉంటుంది. కానీ మీరు చెప్పారు కాబట్టే దేశం మొత్తం తెలిసొచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇది నేను మామూలుగా అన్నీ సినిమాలకి చెప్పను.. ఈ సినిమా మాత్రం రాసి పెట్టుకొండి – #RamCharan pic.twitter.com/dm3lgkrDnW
— Filmy Focus (@FilmyFocus) May 14, 2025