మళ్ళీ అక్కడి నుండే ప్లాన్ చేస్తున్న ‘ఆచార్య’ టీం..!

  • July 31, 2020 / 09:15 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య‌’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది చిరుకి 152వ చిత్రం. మొదట వేసుకున్న ప్లానింగ్ ప్రకారం అయితే.. ఈ పాటికి ఈ చిత్రం షూటింగ్ చాలా వరకూ పూర్తయిపోయి.. పాటలు కూడా విడుదల అవుతూ ఉండేవి. కానీ వైరస్ మహమ్మారి వల్ల పెద్ద దెబ్బ పడింది. ఇప్పుడు షూటింగ్ లు చేసుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. ‘ఆచార్య‌’ షూటింగ్ మొదలు పెట్టలేదు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతుండడంతో షూటింగ్ మొదలు పెట్టడానికి సంకోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ ఎక్కడి వరకూ జరిగింది అనేదాని పై తాజాగా స్పష్టత వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఆచార్య’ చిత్రానికి సంబంధించి మూడు ఫైట్స్ పూర్తి చేశారట. ఫైట్ మాస్టర్స్ రామ్ – ల‌క్ష్మ‌ణ్ లు ఈ ఫైట్స్ ను తెరకెక్కించినట్టు తెలుస్తుంది. చెప్పాలంటే ఇంటర్వెల్ సీన్ కు ముందు వరకూ ‘ఆచార్య’ షూటింగ్ పూర్తయ్యిందట.

ఓ పాటను కూడా తెర‌కెక్కించార‌ట. ‘ఆచార్య‌’ షూటింగ్ తిరిగి మొదలు పెడితే కనుక ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ నుండే మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus