Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కి ఏ దేశానికి వెళ్లారంటే..!

ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే స్టార్స్.. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుని లేదా వీలు చూసుకుని ఫ్యామిలీతో కలిసి విదేశాలకు విహార యాత్రలకు వెళ్తుంటారు.. వీరిలో సూపర్ స్టార్ మహేష్ బాబుది ఫస్ట్ ప్లేస్ అయితే తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటారు. ఫ్యామిలీతో టూర్లు.. పిల్లలతో సరదాలు వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. ఇటీవలి కాలంలో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు చాలా మంది మాల్దీవుల్లో హంగామా చేశారు..

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ ప్లాన్ చేశారు.. 60 ప్లస్ లోనూ ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ ఇలా వరుసగా రెస్టు లేకుండా సినిమాలు చేస్తున్న చిరు ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవాలని.. సరదాగా కుటుంబంతో గడపాలని డిసైడ్ అయ్యారు.. ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ ప్లాన్ చేశారు మెగాస్టార్.. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జపాన్, ఆఫ్రికాతో పాటు పలు ప్రదేశాలు చుట్టి వచ్చారు.

చిరు టూర్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకాభిమానులతో పంచుకున్నారు.. భార్య సురేఖ, పెద్ద కూతురు సుస్మితతో పాటు మనవరాళ్లతో ఆయన యూరప్ బయలు దేరారు.. ‘‘ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర’’ అంటూ.. ఫ్యామిలీతో పాటు ‘వాల్తేరు వీరయ్య’ కథానాయిక శృతి హాసన్‌తో ఉన్న ఫోటోలని షేర్ చేశారు చిరు.. ఇప్పుడీ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

ఇంతకుముందు చిరు నటించిన పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసిన సుస్మిత కొణిదెల ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి కూడా పని చేస్తున్నారు.. మెగాభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే.. జనవరి 13న థియేటర్లలో మాస్ మూలవిరాట్ దర్శనం అంటూ టీమ్ వదిలిన పోస్టర్ ఆకట్టుకుంటోంది..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus