Chiranjeevi, Anjana Devi: వైరల్ అవుతున్న అంజనా దేవి బర్త్ డే ఫోటోలు!

  • January 30, 2024 / 12:52 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తల్లి అంజనదేవి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఈమె నిన్న తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

తన తల్లి కేక్ కట్ చేస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేసిన చిరంజీవి కనిపించే దేవత కనీ పెంచిన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన తల్లికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా చిరంజీవి తన తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్ట్ చేయడంతో అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరి కోసం పరితపించే ఇలాంటి అన్నయ్యకు జన్మనిచ్చినందుకు మీకు రుణపడి ఉంటాం అంటూ అభిమానులు కూడా చిరంజీవి తల్లి అంజనదేవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక చిరంజీవి (Chiranjeevi) సినిమాల విషయానికి వస్తే ఈయన త్వరలోనే విశ్వంభర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకేక్కబోతున్నటువంటి ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతుంది. ఈ సినిమా దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus