మాస్ గుండెల్లో చేరిన ఖైదీ నంబర్ 150 టీజర్

  • December 8, 2016 / 02:46 PM IST

మెగాస్టార్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న  ఖైదీ నంబర్ 150 టీజర్ గురువారం సాయంత్రం  ఎటువంటి హంగామా లేకుండా విడుదలై సంచలనానికి తెరలేపింది. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో చిరు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. “ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా .. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే కోస్తా ” అంటూ చిరంజీవి స్టైల్ గా చెప్పి తన డైలాగ్ డెలివిరీలో ఉన్న కిక్ ని రుచి చూపించారు. ఈ డైలాగ్ వెనుక ఉన్న స్టోరీ ఏంటో సస్పెన్స్ గా ఉన్నప్పటికీ అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక మాస్ అభిమానులకు అత్యంత ఇష్టమైన యాక్షన్ సీన్స్ కి ఇందులో కొదవలేదని కొన్ని ఫైట్స్ క్లిప్పింగ్స్ తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇందులో చిరు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. తన సిగ్నేచర్ వాక్, స్మైల్ తో ఆకట్టుకున్నారు.  టోటల్ గా చెప్పాలంటే   ఖైదీ నంబర్ 150 టీజర్ మాస్ గుండెల్లో చేరిపోయింది. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో  కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus