మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారిపోయారు. అప్పట్లో దివంగత నటుడు, దర్శకుడు,రాజకీయ నాయకుడు అయిన దాసరి నారాయణ రావు తర్వాత ఆ స్థానాన్ని చిరు అందిపుచ్చుకోనున్నట్టు తెలుస్తుంది. ఈయన కూడా అప్పట్లో ఆయనకు లానే అందరి సినిమా ఈవెన్ట్ లకు వెళ్తున్నారు. ‘మూవీ ఆర్ట్స్ అసోసియేషన్’… అదే ‘మా’ లో ఏమైనా గొడవలు వస్తే ఈయనే పరిష్కరిస్తున్నారు.
తాజాగా ‘కరోనా క్రైసిస్ చారిటీ’ ను ఏర్పాటు చేసి … ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లేక .. నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న పేద కళాకారుల కోసం విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే హీరోలు, దర్శకనిర్మాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు. అయితే హీరోయిన్ లు మాత్రం అస్సలు ముందుకు రావడం లేదు. ప్రణీత, లావణ్య త్రిపాఠి వంటి హీరోయిన్ లు తప్ప ఎవ్వరూ ముందుకు సాయం అందించడానికి ముందుకు రాలేదు.
ఈ క్రమంలో చిరు ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ‘కోట్లకు కోట్లు పారితోషికాలు తీసుకునే హీరోయిన్లు కష్టకాలం లో పేద కళాకారులని ఆదుకోవడానికి కనీసం ముందుకు రాకపోవడం సిగ్గు పడాల్సిన విషయం అంటూ మెగాస్టార్ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.ఆయనే స్వయంగా కొంతమంది హీరోయిన్లకు ఫోన్ చేసి మరీ ‘ఇది మీ బాధ్యత’ అంటూ గుర్తుచేస్తున్నట్టు సమాచారం.
Most Recommended Video
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!