మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి రెండు స్ట్రెయిట్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇప్పటికే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ సినిమాలతో పాటు చిరంజీవి ఒక రీమేక్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మలయాళ మూవీ బ్రో డాడీ రీమేక్ లో నటించడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ప్రస్తుతం బ్రో డాడీ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఈ సినిమా రీమేక్ లో నటించడానికి చిరంజీవి ఓకే చెప్పారని త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మలయాళ రీమేక్ లకు క్రేజ్ పెరుగుతోంది. మలయాళ రీమేక్ లు తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందుతుండటం గమనార్హం.
చిరంజీవి ఒకవైపు స్ట్రెయిట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరోవైపు రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు మెగాస్టార్ చిరంజీవి రేంజ్ పెరుగుతుండటం గమనార్హం. చిరంజీవి పారితోషికం కూడా భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా చిరంజీవి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్లకు (Chiranjeevi) చిరంజీవి ఎక్కువగా అవకాశాలు ఇస్తుండటం గమనార్హం. చిరంజీవి సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం కోసం చాలామంది డైరెక్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలో చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు చేయనున్నారు. చిరంజీవి పారితోషికం 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.