టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా విజయంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేశారు. ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత గాడ్ ఫాదర్ తో మంచి హిట్ కొట్టడంతో చిరంజీవి అభిమానులు కూడా ఎంతో సంబరపడుతున్నారు. ఇలా ఈ సినిమా మంచి విజయం సాధించిన అనంతరం చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చిరంజీవి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
గాడ్ ఫాదర్ సినిమా మలయాళంలో లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రం అనే విషయం మనకు తెలిసిందే. అయితే చిరంజీవి మాట్లాడుతూ రీమిక్స్ సినిమాలు చేయడం చాలా కష్టం. ఎంతో ఛాలెంజింగ్ గా ఉంటుంది.ఇదివరకే ప్రేక్షకులు రియల్ సినిమాలు చూసి ఉంటారు. కనుక రీమేక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనీ తెలిపారు. ఇక తాను లూసీఫర్ సినిమాలో నటించాలని రామ్ చరణ్ పట్టు పడ్డారని రామ్ చరణ్ కారణంగానే ఈ సినిమాలో నటించానని తెలిపారు.
ఇక తను నటించిన సినిమాలకు తన భార్య సురేఖ క్రిటిక్ అనే విషయాన్ని కూడా చిరంజీవి తెలిపారు. ఆమె సినిమా ఎలా ఉంది అని తన భావనను ఏమాత్రం మనసులో దాచుకోకుండా బయటకు పెట్టేస్తారు. నేను కూడా తన అభిప్రాయాన్ని ఎంతగానో గౌరవిస్తానని చిరంజీవి వెల్లడించారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన సౌత్ నార్త్ సినిమాల గురించి కూడా మాట్లాడారు.ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో అనేది ఎంత నిజమో నార్త్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి
అనడంలో పూర్తిగా అవాస్తవం ఉందని తెలిపారు. సినిమా ఏ ప్రాంతానికి చెందినది అనేది ముఖ్యం కాదు.. సినిమాకు కంటెంట్ ముఖ్యమని ఈయన తెలిపారు. ఒక్క కంటెంట్ మాత్రమే ప్రతి ఒక్క ప్రేక్షకుడిని థియేటర్ కి తీసుకు రాగలరని, ప్రాంతీయత కాదని ఇకపై ప్రతి ఒక్కరు ప్రాంతీయత అనే ట్యాగ్ మర్చిపోవాలని,ఇది ఇండియన్ సినిమా అంటూ మెగాస్టార్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!