మహేష్ తప్పుకున్నాడు, జూ.ఎన్టీఆర్ లైన్లోకొచ్చాడు..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ‘మిర్చి’, మహేష్ బాబు కు ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’, జూ.ఎన్టీఆర్ కు ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్-బస్టర్స్ తెరకెక్కించాడు కొరటాల శివ. అంతేకాదు.. ఇంకో విశేషం ఏమిటంటే ఈ ముగ్గురు కెరీర్లోనూ అప్పటి వరకు తీసిన సినిమాలలో ఇవే బిగ్గెస్ట్ కలెక్షన్స్ వచ్చిన చిత్రాలు కావడం విశేషం. గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడనే వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ చిత్రం జనవరి నుండీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. అయితే కొరటాలకు సంబంధించి ఇప్పుడు మరో వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.

మెగాస్టార్ చిరంజీవి చిత్రం పూర్తయిన వెంటనే జూ.ఎన్టీఆర్ తో ఒక చిత్రం చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా వినిపించిన కథకు జూ.ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పేసాడని సమాచారం. అయితే మొదట ఈ కథను మహేష్ కు వినిపించగా కథ తనకు సూటయ్యేలా లేదని రిజెక్ట్ చేసాడంట. సో ఇప్పుడే అదే కథను జూ.ఎన్టీఆర్ తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. కొరటాల మిత్రుడైన మిక్కిలినేని సుధాకర్ ఈచిత్రాన్ని నిర్మించబోతున్నాడని సమాచారం. మరి ఒక పక్క జూ.ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి చిత్రమంటే కచ్చితంగా అది రెండు, మూడు సంవత్సరాలు టైం పడుతుందనడంలో సందేహం లేదు. మరి కొరటాల తో జూ.ఎన్టీఆర్ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus