రంగస్థలం మూవీ నిడివి తగ్గించడానికి ఒప్పుకోని చిరు.!

Advertisement

సుకుమార్, రామ్ చరణ్ కలయికలో తొలిసారి రూపుదిద్దుకున్న సినిమా రంగస్థలం కోసం అభిమానులు టికెట్స్ కొనుక్కొని మరీ వెయిటింగ్ చేస్తున్నారు. చిట్టిబాబుగా చెర్రీని చూసేందుకు తహతహ లాడుతున్నారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెన్సార్‌ పూర్తి చేసుకొని నేడు రిలీజ్ అయింది. అమెరికాలోని 2567 స్క్రీన్‌లపై ‘రంగస్థలం’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చిత్ర బృందం భయపడ్డారని తెలిసింది.. కారణం నిడివి .179నిమిషాలు. అంటే ఒక్క నిమిషం తక్కువ మూడు గంటలు.

ఇంత భారీ నిడివిగల సినిమాను చూస్తారా? అని చిత్ర బృందం కత్తెరకు పని చెప్పాలని అనుకున్నారు. ఈ విషయాన్నీ చిరంజీవికి చెబితే ఒప్పుకోలేదంట. ఇందులో ప్రతీ సన్నివేశానికి ప్రాధాన్యం ఉందని, ఎలాంటి కోతలు పెట్టవద్దని అన్నారట. దీంతో సన్నివేశాలకు కత్తెర వేసే ఆలోచనను సుకుమార్ విరమించుకున్నారు. ఇటీవల హిట్ అందుకున్న “అర్జున్‌రెడ్డి” నిడివి 182 నిమిషాలు. అయినా ప్రేక్షకులు ఆదరించారు. ఈ నేపథ్యంలో ‘రంగస్థలం’  హిట్ సాధించింది ..

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags