Chiranjeevi, Prabhas: ప్రభాస్ మూవీలో నటిస్తున్న చిరంజీవి.. కానీ..?

Advertisement

150కు పైగా టాలీవుడ్ సినిమాల్లో నటించి వెండితెరపై నటుడిగా చిరంజీవి సత్తా చాటారనే సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభాస్ వరుస హిట్లతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ ను సంపాదించుకున్నారు. చిరంజీవి, ప్రభాస్ ఒకే సినిమాలో నటిస్తే మాత్రం ఆ సినిమాపై అంచనాలు మామూలుగా ఉండవు. ఈ ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

గడిచిన కొన్నేళ్లలో టాలీవుడ్ స్థాయి ఊహించని విధంగా పెరిగింది. పాన్ ఇండియా కథలకే టాలీవుడ్ హీరోలు ప్రాధాన్యత ఇవ్వడంతో బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ సినిమాలో నటిస్తుండగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం మెగాస్టార్ రెబల్ స్టార్ కలిసి దిగిన ఒక ఫోటో వైరల్ అవుతుండగా ఈ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రభాస్ కు గాడ్ ఫాదర్ పాత్రలో చిరంజీవి నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త కనుక నిజమైతే మాత్రం అటు మెగా స్టార్, ఇటు రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.

ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో పాటు రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నారు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తరువాత లూసిఫర్, వేదాళం రీమేక్ లలో చిరంజీవి నటించాల్సి ఉంది.
Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus