2023 సంక్రాంతికి తెలుగులో ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ వంటి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ మూవీ తెలుగులో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఓ డబ్బింగ్ సినిమాకి ఇన్ని థియేటర్లు ఇవ్వడం ఏంటి అంటూ చాలా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం పై చిరంజీవి, బాలకృష్ణ వంటి బడా హీరోలు స్పందించింది లేదు.
కానీ నిన్న వైజాగ్ లో జరిగిన ‘వాల్తేరు వీరయ్య’ చిరంజీవి పరోక్షంగా దిల్ రాజు పై సెటైర్లు వేసినట్టు స్పష్టమవుతుంది. చిరంజీవి మాట్లాడుతూ.. “రామానాయుడు, అశ్వనీదత్, అల్లు అరవింద్, కేఎస్ రామారావు లాంటి గొప్ప నిర్మాతల స్థాయిలో నిలబడ్డదగ్గ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు, చెర్రీ. ఏనాడూ లెక్కలు చూసుకోలేదు. ఎక్కడా రాజీ పడలేదు, సినిమాకి కావాల్సిన సమస్తం సమకూర్చారు. సినిమాలో మొదటి ఇరవై నిమిషాల్లో హాలీవుడ్ స్థాయి ఎపిసోడ్స్ ఉంటాయి.
అవి తెరపై చూస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ కి సినిమా అంటే ప్యాషన్. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఇలాంటి నిర్మాతలని నిలబెట్టుకోవడం మన ఇండస్ట్రీ బాధ్యత. ఇన్నేళ్ల పరిశ్రమలో ఒకే నిర్మాత రెండు భారీ చిత్రాలు ఒకేసారి విడుదల చేయడం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరిగింది. దీనికి కారణం కథలపై వారికుండే నమ్మకం. ప్రేక్షకులు రెండు సినిమాలని ఆదరిస్తారనే నమ్మకం. మైత్రీ మూవీ మేకర్స్ సంక్రాంతి రిలీజ్ చేయబోయే రెండు సినిమాలు వీరసింహారెడ్డి,
వాల్తేరు వీరయ్య పెద్ద విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఈ వైజాగ్ సాక్షిగా కోరుకుంటున్నాను. ‘సార్(నవీన్ ఎర్నేని ని) మీకు ఈ రెండు సినిమాలు రెండు కళ్ళు లాంటివి. రెండు సినిమాలు సూపర్ హిట్లు అవుతాయి. మిమ్మల్ని చూసి చాలా మంది కూడా కుళ్ళుపోయే పరిస్థితి వస్తుంది. కానీ వద్దు వాళ్ళు ఇచ్చే ప్రశంసలను ఫ్యూయల్ లా తీసుకుని రాకెట్ లా దూసుకుపోండి” అంటూ పరోక్షంగా దిల్ రాజు పై సెటైర్ వేశారు.