ఇండస్ట్రీలో ఎలాంటి అండ లేకుండా స్వయంకృషితో ఎదిగిన హీరోలు ఎవరు అనగానే మొదట వినిపించే పేరు మెగాస్టార్ చిరంజీవి అయితే ఆ వరుసలో వినిపించే తరువాతి పేరు మన మాస్ మహారాజ రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత చిన్న-చితక పాత్రలు, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి సింధూరం సినిమాతో మంచి నటుడు అనే గుర్తింపుని సాధించాడు.
కట్ చేస్తే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలతో మాస్ హీరో కటౌట్ గా ఎదిగాడు. ఆ తరువాత నుండి రవితేజ అనే మనిషి వేను తిరిగి చూసుకోలేదు. రాజా ది గ్రేట్ , క్రాక్ సినిమాల తరువాత మా హీరో ఎప్పుడు మాస హిట్ కొడతాడా? అని వేచి చుసిన మాస్ మహారాజ ఫ్యాన్స్ కి ఎట్టకేలకు హిట్ వచ్చింది.
ధమాకా మూవీకి మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ…ఫస్ట్ డే, సెకండ్ డే నుండి పాజిటివ్ టాక్ తో సినిమా కలెక్షన్స్ లో దూకుడు పెరిగింది. పది రోజులు పూర్తి చేసుకున్న ధమాకా మూవీ రవితేజ కెరీర్లో ఎప్పుడు లేని రికార్డ్స్ నమోదు చేస్తుంది… అయితే ధమాకా తో పాటు రవితేజ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు వాటి కలెక్షన్స్ ఇప్పుడు చూసేద్దాం పదండి…