Chiranjeevi: ఆ లాకెట్ పోయిందని బాధ పడ్డ చిరంజీవి.. ఏం జరిగిందంటే?

  • February 10, 2023 / 04:04 PM IST

సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న చిరంజీవి నిజం విత్ స్మిత కార్యక్రమంలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. సినిమా రంగంలో తనకు గాడ్ ఫాదర్స్ లేరని స్వయంకృషితో తాను ఈ రేంజ్ కు చేరుకున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు. నేను మద్రాస్ కు వెళ్లిన సమయంలో నువ్వేం అందగాడివి అని కామెంట్ చేశారని ఆయన వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చిరంజీవి అన్నారు.

కొన్ని అవమానాలను సమాధానపరచుకుని సాధారణ లైఫ్ లోకి వచ్చేవాడినని ఆయన కామెంట్లు చేశారు. మద్రాస్ కు వెళ్లిన తర్వాత పాండీ బజార్ లో ఒక వ్యక్తి అతడి కంటే నువ్వు అందగాడివా అంటూ కామెంట్ చేశాడని నీ కలను మరిచిపో అంటూ ఆ వ్యక్తి నన్ను ఎగతాళి చేశాడని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఎవరైనా నన్ను విమర్శిస్తే ఆ విమర్శలను పట్టించుకోనని వాటిని చూసి నవ్వుకుంటానని గుర్తింపు పొందడం కొరకు మాత్రమే ఆ వ్యక్తి నాపై విమర్శలు చేస్తున్నాడని భావిస్తానని చిరంజీవి అన్నారు.

నా పాత సినిమాలలో మెడలో హనుమంతుని లాకెట్ ఉంటుందని ఆ లాకెట్ నన్ను కాపాడుతుందని కెరీర్ తొలినాళ్ల నుంచి నమ్మానని చిరంజీవి తెలిపారు. అన్నయ్య మూవీ సమయంలో ఆ లాకెట్ పోయిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రతి వ్యక్తి ప్రశంసలకు పొంగిపోకూడదని విమర్శలకు కృంగిపోకూడదని చిరంజీవి కామెంట్లు చేశారు. విమర్శలు, ప్రశంసలను సమానంగా తీసుకుని ముందుకు వెళ్లినవాడే నాయకుడు అని చిరంజీవి అన్నారు.

చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో చిరంజీవి నటిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో చిరంజీవి, తమన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus