Chiranjeevi: కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే చిరు ఆస్తి అమ్ముకోవడం ఏంటబ్బా?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆరుపదుల వయసులో కూడా ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే ఈయన తాజాగా తన ప్రాపర్టీని అమ్మినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ మొదట్లో లక్షలు విలువ చేసే ఆస్తిపాస్తులను కొనుగోలు చేశారు

అయితే ఇప్పుడు ఆ ఆస్తులు కొన్ని కోట్ల రూపాయలు ధర పలుకుతున్నాయి.ఈ క్రమంలోనే ఫిలింనగర్ మెయిన్ రోడ్డుకు పక్కన ఉన్నటువంటి ఓ విలువైన స్థలం మెగాస్టార్ అమ్మినట్టు తెలుస్తుంది. ఇలా ఈయన ఆస్తులు అమ్మడంతో ఆస్తుల అమ్మే అంత కష్టం ఏమొచ్చింది అంటూ పెద్ద ఎత్తున ఆరాతీస్తున్నారు. ఈ విధంగా చిరంజీవి ఈ ఆస్తి అమ్మడానికి గల కారణం ఓ దినపత్రిక యజమాని ఈ స్థలం పై ఆసక్తి కనపరచడమే కాకుండా ఈ స్థలం తనకు అమ్మాలని చిరంజీవిని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ స్థలాన్ని ఆయన కొనుగోలు చేసి దినపత్రిక కార్యాలయం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారట.ఈ క్రమంలోనే ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ స్థలం కోసం ఆసక్తి చూపడంతో మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రాపర్టీని అమ్మినట్టు తెలుస్తోంది. ఇక ఈ స్థలాన్ని మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో 30 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారట. అయితే ప్రస్తుతం ఇదే స్థలాన్ని ఈయన ఏకంగా 70 కోట్ల రూపాయలకు అమ్మినట్లు సమాచారం.

ఇక్కడ ఒక్కో గజం రెండున్నర లక్ష రూపాయల వరకు ధర పలుకుతుందని ఈ క్రమంలోనే చిరంజీవి ఈ స్థలం ద్వారా భారీగానే లాభ పొందారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus