Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు బడా స్టార్లను చూస్తే ఆ కిక్కే వేరు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, చరణ్ కలిసి చేసిన ‘నాటు నాటు’ డ్యాన్స్ ప్రపంచాన్నే ఊపేసింది. ఆ దెబ్బతో ఇద్దరు హీరోలు కలిసి డ్యాన్స్ చేస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అందరికీ అర్థమైంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి మ్యాజిక్ ను సీనియర్ హీరోలతో రిపీట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఆ ఇద్దరు ఎవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్.

Chiranjeevi

ఈ క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసింది మరెవరో కాదు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం చిరంజీవితో ఆయన ‘మన శంకర వరప్రసాద్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు. అయితే కేవలం గెస్ట్ రోల్ గా వచ్చి వెళ్ళడం కాకుండా, ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఒక అదిరిపోయే మాస్ సాంగ్ ను ప్లాన్ చేశారట. మరీ RRRరేంజ్ లో కాకపోయినా స్టైలిష్ హుక్ స్టెప్స్ కలిసి చేస్తారని టాక్ వస్తోంది.

ఇక్కడే అసలు రచ్చ ఉంది. ఈ పాటలో చిరు, వెంకీ కలిసి స్టెప్పులు వేయబోతున్నారు. వీరిద్దరి కోసం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఒక ఊర మాస్ ట్యూన్ రెడీ చేశారట. ముఖ్యంగా ఇందులో ఒక సిగ్నేచర్ ‘హుక్ స్టెప్’ ఉంటుందని, అది రిలీజ్ అయితే సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయమని ఇన్ సైడ్ టాక్. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే పాటలో కనిపిస్తే ఆ హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

అనిల్ రావిపూడికి వెంకటేష్ తో మంచి బాండింగ్ ఉంది. ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో వెంకీలోని కామెడీ యాంగిల్ ను పిండేశారు. ఇప్పుడు చిరంజీవి సినిమాలో కూడా వెంకీని భాగం చేసి, ఆడియన్స్ కు ‘డబుల్ ధమాకా’ ఇవ్వబోతున్నారు. తెరపై వీరిద్దరి కామెడీ టైమింగ్ తో పాటు, ఈ డ్యాన్స్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాకు నయనతార హీరోయిన్. ఇక సినిమాలో ఆ సర్ ప్రైజ్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus