మెగాస్టార్ అడ్డుపడుతున్నాడు!

ఒక పక్క మెగాస్టార్ సైరా…మరో పక్క మెగా పవర్‌స్టర్ రంగస్థలం…ఈ రెండు సినిమాలు మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇవ్వడం కోసమే అన్నది చెప్పక తప్పదు. అయితే ఒక పక్క మెగాస్టార్ సినిమా వస్తుంది అన్న ఆనందం ఉంటే, మరోపక్క మెగా పవర్ స్టార్ సినిమా లేట్ అవుతుంది అన్న బాధ సైతం అభిమానుల్లో వ్యక్తం అవుతుంది…ఇంతకీ చెర్రీ సినిమా లేట్ కావడానికి అసలు కారణం ఎవరో తెలుసా…మెగాస్టార్ అండ్ చెర్రీ నే అట…అదేలా అంటారా…ఈ మ్యాటర్ చదవండి మీకే అర్ధం అవుతుంది…మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. అసలైతే ఈ సినిమా ఈపాటికల్లా షూటింగ్ పూర్తి చేసుకోవాలి కాని చరణ్ వల్లే షూటింగ్ కు అంతరాయం కలుగుతుందట. అది కూడా తాను నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి వల్లే రంగస్థలం లేట్ అవుతుందని అంటున్నారు.

ఇక సైరా సినిమా కోసం చరణ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో తను నటించే రంగస్థలం మూవీ షూటింగ్ లేట్ అవుతుందట. మరో పక్క రంగస్థలం సినిమాలో చెర్రీ పక్కన సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే…ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అనసూయ కూడా సినిమాలో స్పెషల్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు. డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తయినా సంక్రాంతికే సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారట. సైరా మీద ఫోకస్ పెడుతున్న చరణ్ కాస్త రంగస్థలం పూర్తి చేసేదాకా కాస్త సహకరిస్తే బెటర్. ఎందుకంటే చీరి ఫ్యాన్స్ కూడా తన సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా…మరి ఈ విషయం చెర్రీ ఆలోచించి త్వరలోనే రంగస్థలం పూర్తి చేసి ఫ్యాన్స్ కి అందించాలని కోరుకుందాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus