మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్ దంపతులకు పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కళ్యాణ్ దేవ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. తన పాప కాలిముద్ర ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో ఆయన పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇప్పుడు ఈ విశేషంతో మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఇక ఈ పాప ఫోటో ను ఎప్పుడు పోస్ట్ చేస్తారు అంటూ కొందరు మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు చిన్న మనవరాలితో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. ఈ ఫొటోలో మనవరాలిని ఎత్తుకుని చిరు దంపతులు మురిసిపోతుండడం విశేషం. ఇక ఈ 2018 వ సంవత్సరం మెగా ఫ్యామిలీకి మంచి ఇయర్ చెప్పుకోవచ్చు. ఇదే సంవత్సరం మెగా పవర్ స్టార్ ‘రంగస్థలం’ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. ఇక రాంచరణ్ -రాజమౌళి – జూ.ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కూడా మొదలయ్యింది. అంతేకాదు మెగాస్టార్ 152 వ చిత్రం కూడా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఖరారవ్వడంతో.. పాటు ‘వినయ విధేయ రామా’ చిత్రం కూడా రిలీజ్ కు రెడీ అవుతుండడంతో .. మెగా అభిమాలు కూడా పండుగ చేసుకుంటున్నారు.