Mega 158: ఈ ఏజ్‌లో యంగ్ హీరో రోల్.. రిస్క్ చేస్తున్నారా? టాలెంట్ చూపించాలనా?
- August 3, 2026 / 03:35 PM ISTByFilmy Focus Desk
విజువల్ ఎఫెక్ట్స్, డీఏజింగ్ రెండువైపులా వాడి ఉన్న కత్తి లాంటిది. సరిగ్గా వాడితే మంచిది.. ఏదైనా తేడా కొట్టిందంటే అసలుకే మోసం వస్తుంది. ఈ విషయంలో గతంలో ఓసారి క్లియర్‌గా ఫేస్ చేసిన ప్రముఖ నటుడు చిరంజీవి మరోసారి అదే రిస్క్ చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్.
Mega 158
అందులో ఓ పాత్ర కుర్రాడు కాగా, రెండో పాత్ర కాస్త వయసు పైబడిన పాత్ర. ఈ రెండు పాత్ర కోసమే చిరంజీవి మునపటి ఫిజిక్, లుక్ కోసం జిమ్‌లో కష్టపడుతున్నారని టాక్. అయితే ఇదే సమయంలో కుర్రాడి పాత్ర కోసం బాబీ.. డీఏజింగ్ టెక్నాలజీని ట్రై చేయాలని ట్రై చేస్తున్నారట. గతంలో ‘ఆచార్య’ సినిమా సమయంలో కొరటాల శివ ఈ ప్రయత్నం చేసి దారుణంగా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు మళ్లీ డీఏజింగ్ అంటే ఫ్యాన్స్ కాస్త భయపడుతున్నారు.
అయితే అప్పుడు ఆ పని చేసింది కొరటాల శివ టీమ్ అని, ఇప్పుడు బాబీ అండ్ కో. జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తారని అంటున్నారు. మరి చిరంజీవి ఓన్‌గా యంగ్ లుక్ కోసం ట్రై చేస్తారా? లేక డీఏజింగ్‌కి వెళ్తారో చూడాలి. ఇక ఈ సినిమా నుండి ఆగస్టు 22న స్పెషల్ వీడియో ఒకటి వస్తుందట. అందులో చిరంజీవి లుక్, సినిమా లైన్ తెలిసే అవకాశం ఉంది. తండ్రీ కుమార్తెల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.
సినిమా అనౌన్స్‌మెంట్ కాన్సెప్ట్ పోస్టర్‌లోని గొడ్డలి మీద ‘বংশে আসছে’ అని రాసి ఉంది. అది బంగ్లా. ‘వంశంలోకి వస్తున్నాడు’ అని దాని అర్థం. అంటే సినిమాలో హీరో తన కుటుంబానికి దూరంగా ఉంటాడు. కీలకమైన సమయంలో తిరిగి తన వారి దగ్గరకు వస్తాడు. వచ్చాక ఏమైంది, ఆ ముందు ఏమైంది అనేది అనేదే సినిమా మెయిన్ లైన్ అని చెప్పొచ్చు. ‘The Blade That Set The Bloody Benchmark’ అని కూడా రాశారు. ‘ఓ బెంచ్ మార్క్ సెట్ చేసిన బ్లేడ్’ అని దాని అర్థం. మరి హీరో ఈ సినిమాలో ఏ విషయంలో బెంచ్ మార్క్ సెట్ చేశాడు? ఆ వంశం సంగతి ఏంటి అనేది సినిమా వచ్చాక కానీ తెలియదు. బెంగాళీలో రాశారు కాబట్టి ఈ సినిమా కోల్‌కతా నేపథ్యంలో ఉంటుంది అని అర్థమవుతోంది.













