Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
- August 3, 2026 / 02:16 PM ISTByFilmy Focus Desk
నితిన్ – నాని కాంబినేషన్‌లో సినిమా రూపొందబోతోంది అంటూ గత కొన్ని రోజులు టాలీవుడ్‌లో ‘సన్నిహిత’ మీడియా నుండి తెగ ప్రచారం జరిగింది. సినిమా గురించి పూర్తి సమాచారం ఉన్నా.. కావొచ్చనే యాంగిల్‌లో ఆ సినిమా మీద ప్రచారం సాగింది. అయితే ఈ సినిమా కచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటుంది అని చెబుతూ వస్తున్నారు. అనుకున్నట్లే సినిమా కన్‌ఫామ్ అయింది. అంతేకాదు అనౌన్స్‌మెంట్ వీడియో కూడా వచ్చేసింది. ఆ సినిమా పేరే ‘అలియాస్ రుక్మిణీ’. నితిన్ హీరోగా నాని సమర్పిస్తున్న సినిమా ఇది. ఆయన సోదరి దీప్తి నిర్మాత.
Alias Rukmini
ఈ సినిమాకు సంబంధించి వచ్చిన వీడియో చూస్తే.. ఫస్ట్ లుక్‌లోనే హిట్ వైబ్ కనిపించింది. సినిమా టైటిల్ వల్లనో, కాన్సెప్ట్ వీడియో వల్లనో కానీ.. ‘అలియాస్ రుక్మిణీ’ సినిమా ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. శృంగార నవలలు రాసే కృష్ణ అనే ఓ కుర్రాడు వాటి ద్వారా కలం పేరు రుక్మిణితో పాఠకులకు దగ్గరవుతాడు. ఎవరైనా రుక్మిణి ఎవరని అడిగితే నా భార్య అని అంటాడు. ఇంతకీ రుక్మిణీ అనే అమ్మాయి కృష్ణ ఆమె నిజంగా వైఫేనా, లేక తనే అలా అనుకుంటున్నాడా అనేది సినిమా. ఒకవేళ కృష్ణ జీవితంలోకి రుక్మిణీ అనే అమ్మాయి వస్తే ఏంటి అనేది కథ అని చెప్పొచ్చు.
‘దండోరా’ లాంటి సీరియస్ కాన్సెప్ట్ సినిమాతో విమర్శకులను మెప్పించిన దర్శకుడు మురళీ కాంత్ దేవసోత్.. ఈ సినిమాకు దర్శకుడు. ఈసారి ఏకంగా రూటు మార్చి రసాత్మక వినోదం వైపు వచ్చేశారు. స్టోరీ పాయింట్ చూస్తుంటే నవ్వించడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అలాగే ఆ నవ్వులకు కాస్త రసరమ్య కవ్వింపులు కూడా ఉన్నాయి. మాములుగా అయితే ఈ కాలంలో నవలలు చదివే వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఈ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం చూస్తుంటే మురళికాంత్ వెనక్కు వెళ్లి 90 దశకం కథ చెబుతారు అని చెబుతున్నారు.
ఇక వరుస ఫ్లాప్‌లు ఉన్నప్పుడు ‘నేను శైలజ’ అనే లేడీ నేమ్ ఉన్న సినిమా చేసి హిట్ ట్రాక్ ఎక్కాడు రామ్. ఇప్పుడు నితిన్ కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నాడు. మరి అలాంటి మంచి విజయం వస్తుందా అనేది చూడాలి. ఇదంతా ఓకే కానీ ‘రుక్మిణి’గా నటించే హీరోయిన్ ఎవరబ్బా?












