మెగాస్టార్ 151వ సినిమా టైటిల్ ఇదే…
- August 21, 2017 / 01:11 PM ISTByFilmy Focus
మన బాస్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన 151వ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ను రేపు విడుదల చేయనున్న విషయం తెలిసిందే. సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు, కీలకపాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ.. అసలు సినిమా టైటిల్ ఏంటా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. తొలుత “ఉయ్యలవాడ నరసింహారెడ్డి” జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది కాబట్టి అదే పేరును టైటిల్ గా పెడతారని అందరూ భావించారు, రేపు ఆవిష్కరించబోయేది కూడా అదే టైటిల్ అని అందరూ ఫిక్స్ అయిపోయిన తరుణంలో “అది సినిమా టైటిల్ కాదు” అంటూ అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చింది సినిమా పి.ఆర్ టీం.
అప్పట్నుంచి.. సినిమా టైటిల్ ఏంటా అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో “మహా వీర” అనే టైటిల్ వెలుగులోకి వచ్చింది, ఇప్పుడేమో “సై రా” అనే టైటిల్ ఉన్నట్లుంది వెలుగులోకి వచ్చింది. మరి ఈ రెండిట్లో ఏది ఫైనల్ అవుతుందో తెలియాలంటే రేపు 11 గంటలవరకు వేచి చూడాల్సిందే!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















