చిరు, కొరటాల సినిమా 2020 లో లేనట్టేనా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రాంచరణ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఈ పాత్ర 40 నిమిషాల వరకూ ఉంటుందని టాక్. అయితే ఈ పాత్ర వల్లే ఇప్పుడు ఈ చిత్రం 2021 సమ్మర్ కి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని తాజా సమాచారం.

ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి ఆగష్టులో విడుదల చెయ్యాలని చిరు,చరణ్, కొరటాల ప్లాన్ చేశారట. అయితే దీనికి రాజమౌళి అభ్యంతరాలు తెలిపినట్టు తెలుస్తుంది. 2021 సమ్మర్ కే.. ‘ఆచార్య’ ను విడుదల చెయ్యాలని షరతు పెట్టాడట. ఈ చిత్రంలో చరణ్ పాత్ర ఉండడం వల్లే రాజమౌళి ఈ కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా 2021 జనవరి 8న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోలను మరో సినిమాల్లో నటించకుండా హద్దులు పెడుతుంటాడని ఎప్పటి నుండో టాక్ ఉంది. ‘ఒకవేళ సినిమా చేసినా ఆ సినిమాని తన సినిమా కంటే ముందు విడుదల కానివ్వడని ఈసారి ప్రూవ్ అయ్యింది’ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏమైనా మెగాస్టార్ ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన సినిమాని 99రోజుల్లో పూర్తిచేయాలని కొరటాలకు కండిషన్ పెట్టినా ఉపయోగం లేకుండా పోయిందని స్పష్టమవుతుంది.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus