Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడు, దిగ్గజ హాలీవుడ్‌ నటుడు చక్‌ నోరిస్‌ (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మార్చి 19న మరణించినట్లు కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో హాలీవుడ్‌ నటులు, మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణులు తమ విచారం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ కూడా నివాళులర్పించాడు. మార్షల్‌ ఆర్ట్స్‌ ప్లేయర్‌గా ఎన్నో ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్న నోరిస్‌.. తొలి రోజుల్లో కొన్ని హాలీవుడ్‌ సినిమాలకు మార్షల్‌ ఆర్ట్స్‌ ఇన్‌స్రక్టర్‌గా కూడా పనిచేశారు.

Chuck Norris

1968లో ‘ది రెక్కింగ్‌ క్రూ’ అనే సినిమాతో సినిమాలకు పరిచయమయ్యారు. ‘గుడ్‌ గాయ్స్‌ వేర్‌ బ్లాక్‌’ సినిమా విజయం సాధించడంతో యాక్షన్‌ స్టార్‌గా నోరిస్‌ పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన ‘ఎ ఫోర్స్‌ ఆఫ్‌ వన్‌’, ‘ది ఆక్టాగన్‌’, ‘యాన్‌ ఐ ఫర్‌ యాన్‌ ఐ’ సినిమాలతో ప్రపంచస్థాయిలో గుర్తింపు సంపాదించారు. 2006 వరకు సినిమాలతో అలరించిన చక్‌ నోరిస్‌ చివరిగా ‘ది ఎక్స్‌పాండబుల్స్‌ 2’ సినిమాలో నటించాడు. అంతేకాదు ఆయన మార్షల్‌ ఆర్ట్స్, ఫిలాసఫీ తదితర అంశాలపై పుస్తకాలు కూడా రాశారు.

హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus