Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

గోపీచంద్‌.. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న ప్రతిసారి ఓ దర్శకుడు ముందుకొస్తారు. ఓ మంచి సినిమా చేసి మళ్లీ గోపీ తన ఫామ్‌లోకి వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత కొనసాగించడం లేకపోవడం గోపీ చేతుల్లో ఉందనుకోండి. అది సరిగ్గా చేయడం లేదు అనేది అభిమానుల మాట. ఆ విషయం వదిలేస్తే ఇప్పుడు గోపీచంద్‌ మరోసారి తన ట్రబుల్‌ షూటర్‌ వైపు చూస్తున్నారని సమాచారం. మరోవైపు ఆయనకు కూడా విజయం అవసరం కాబట్టి ఆయన కూడా గోపీవైపు చూస్తున్నారు. ఆయనే సంపత్‌ నంది.

Gopichand – Sampath Nandi

‘విశ్వం’ సినిమా తర్వాత గోపీచంద్‌ నుండి మరో సినిమా రాలేదు. ఈ సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతోంది. అప్పటి నుండి ఆయన కొత్త కథ కోసం, దర్శకుల కోసం కూడా చూశారు. ఈ క్రమంలో ఒకట్రెండు కథలు దాదాపు ఓకే అయినా ముందుకెళ్లలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఓ మూడు కథలు ఫైనల్‌ చేసుకున్నారు అని చెబుతున్నారు. అందులో ఒకటి ఇప్పుడు సెట్స్‌ మీద ఉండగా.. మరో రెండు చర్చల్లో ఉన్నాయి. ఇప్పుడు నాలుగో సినిమా దాదాపు ఓకే అయింది అంటున్నారు.

ఆ నాలుగో సినిమా గోపీచంద్‌, సంపత్‌ నందికి హ్యాట్రిక్‌ అవ్వబోతోంది అని టాక్‌. ఇద్దరూ ‘గౌతమ్ నందా’, ‘సీటీ మార్’ అంటూ రెండు హిట్‌ సినిమాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ హ్యాట్రిక్‌ సినిమాను గోపీచంద్‌ సన్నిహిత నిర్మాత కేకే రాధామోహన్ నిర్మిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం సంపత్‌ నంది.. శర్వానంద్ హీరోగా ‘భోగి’ తెరకెక్కిస్తున్నారు. అదయ్యాకనే గోపీచంద్‌ సినిమా ఉంటుందని టాక్‌.

గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత భోగవల్లి ప్రసాద్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తారట. ఇదిలా ఉండగా ఓ ఫైట్‌ మాస్టర్‌ చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చి పూర్తి స్థాయి కథ సిద్ధం చేయమని చెప్పారట గోపీచంద్‌. త్వరలోనే ఆ సినిమా అనౌన్స్‌మెంట్‌ కూడా ఉంటుంది అని చెబుతున్నారు.

ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus