Hansika: హన్సిక ఇంజక్షన్లు తీసుకున్నారా.. ఆమె ఏమన్నారంటే?

దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హన్సిక తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే 16 సంవత్సరాల వయస్సులోనే హన్సిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా దేశముదురు సినిమాలో ఎక్కువ వయస్సు ఉన్న అమ్మాయిలా ఆమె కనిపించడంపై కొన్ని రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఎదగడానికి హన్సిక ఇంజక్షన్లు తీసుకున్నారని ప్రచారం జరిగింది.

అయితే హన్సిక ఏ ఇంటర్వ్యూలో కూడా ఈ కామెంట్ల గురించి చెప్పడానికి ఇష్టపడలేదు. తాజాగా ఒక సందర్భంలో హన్సిక తల్లి ఈ కామెంట్ల గురించి స్పందించడంతో పాటు వివరణ ఇచ్చారు. ఎదగడానికి హన్సిక హార్మోన్ ఇంజక్షన్లు తీసుకున్నట్టు జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆమె అన్నారు. తన దగ్గర చాలా డబ్బు ఉండి ఉంటే మాత్రమే హన్సికకు అలాంటి ఇంజక్షన్లు ఇవ్వడం సాధ్యమయ్యేదని ఆమె తెలిపారు.

హార్మోన్ ఇంజక్షన్లను కొనుగోలు చేయాలంటే టాటా, బిర్లా లాంటి ధనికులకే సాధ్యం అవుతుంది తప్ప తమలాంటి సామాన్యులకు కాదని హన్సిక తల్లి చెప్పుకొచ్చారు. కొంతమంది అవగాహన లేకుండా ఇలాంటి వార్తలు రాస్తారని ఆమె అన్నారు. హన్సిక పెద్ద అమ్మాయిలా కనిపించడం గురించి ఆమె స్పందిస్తూ పంజాబీ అమ్మాయిలు వేగంగా ఎదుగుతారని హన్సిక తల్లి చెప్పుకొచ్చారు.

తెలుగు, తమిళ భాషల్లో 50కు పైగా సినిమాలలో నటించిన హన్సిక మెజారిటీ సినిమాలతో విజయాలను అందుకున్నారు. హన్సిక పలువురు అనాథలను దత్తత తీసుకుని తన మంచి మనస్సును చాటుకున్నారు. రోజురోజుకు నటిగా హన్సిక స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. హన్సికకు తెలుగులో ఆఫర్లు లేకపోయినా తమిళంలో ఆఫర్లు మాత్రం పెరుగుతుండటం గమనార్హం. హన్సికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హన్సికకు సోషల్ మీడియాలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హన్సికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus