రెండు పెద్ద సినిమాలు ఒకే తేదీకి లేదంటే ఒకే సీజన్‌లో విడుదల అవ్వాలి అంటే.. కచ్చితంగా అది ఫెస్టివల్ సీజనే అవ్వాలి అని అంటారు టాలీవుడ్‌లో. ఇది ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సంప్రదాయం. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు వస్తే నార్మల్ డేస్‌లో ప్రేక్షకుల ఆదరణ విడిపోయి రెండు సినిమాలకూ నష్టం కలుగుతుంది కాబట్టి ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా తెలిసి కూడా కొంతమంది నిర్మాతలు ఒకే డేట్‌ని అనౌన్స్ చేస్తుంటారు. రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు ‘మేం రావడం లేదు’ అంటూ ఓ నిర్మాత ప్రకటిస్తారు.
ఇప్పుడు మార్చి చివరి వారంలో జరగుతుంది అని అనుకుంటున్న P X P క్లాష్ విషయంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. మార్చి 26న విడుదల చేస్తాం అంటూ చెబుతున్న ‘ది ప్యారడైజ్’, మార్చి 27న వస్తాం అని చాలా రోజులుగా చెబుతున్న ‘పెద్ది’ గురించి మాట్లాడుకుంటున్నారు. రెండూ వస్తే ఎలా ఉంటుంది అంటూ అంచనాలు వేస్తున్నారు. అయితే టాలీవుడ్ ప్యాటర్న్ తెలిసినవాళ్లు మాత్రం ఆ రెండు సినిమాలు ఒకసారి రావడం అసాధ్యం అని తేల్చేశారు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ నిర్మాత క్లారిటీ ఇచ్చేశారు.
ఈ సంక్రాంతికే పంపిణీదారులపై ఎక్కువ సినిమాల్ని రుద్దేసి తప్పు చేశామేమో అనిపిస్తోంది. అందుకే ఇప్పుడు మరోసారి అదే పని చేయాలని అనుకోవడం లేదు అని క్లారిటీగా చెప్పేశారు. తాము మేం ప్రస్తుతం నిర్మిస్తున్న ‘ది ప్యారడైజ్’ విషయంలో ఆ పరిస్థితి పునరావృతం కానివ్వమని చెప్పారు. మార్చిలో తమ సినిమా విడుదల అనుకున్నాం కానీ, ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’ సినిమాలు ఒకేసారైతే విడుదల కావు అని చెప్పారు. మేమంతా స్నేహితులమే, మాట్లాడుకుని సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.
ఆయన క్లియర్‌గా చెప్పలేదేమో కానీ.. మార్చి ఆఖరి వారంలో రెండు సినిమాలు ఒకేసారి రావు. అంటే ‘పెద్ది’ వచ్చేటట్లయితే ‘ది ప్యారడైజ్’ రాదు. అదే ‘ప్యారడైజ్’ వస్తుంది అంటే ‘పెద్ది’ రాడు. కాబట్టి PXP క్లాష్ అయితే లేదు.