బాహుబలి సినిమా తర్వాత దగ్గుబాటి రానా హీరోగా చేస్తున్న సినిమా “నేనే రాజు నేనే మంత్రి”. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కర్నూలు జిల్లా బనగానపల్లిలో జరిగిన షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ఈ మూవీలో క్లైమాక్స్ హైలెట్ కానుందని సమాచారం. ఈ చిత్రంలో రాజకీయనాయకుడైన హీరోకి ఉరిశిక్ష వేస్తారు. కాసేపట్లో ఉరితీస్తారనగా పారిపోతాడు. తనపై పడిన నిందను తొలగించుకొని రిలీజ్ అవుతాడు. ఈ సన్నివేశం సినిమాలోనే హైలెట్ కానుందని చిత్ర బృందం వెల్లడించింది.
ఇందులో రానా నటన అద్భుతంగా ఉంటుందట. టీజర్ లో చూపించిన వీడియో ఆ సీన్ లోనిదే. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా అశితోష్ రాణా, కేథరిన్ థెరిస్సా, నవదీప్, పోసాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ కోసం అనూప్ రూబెన్స్ సమకూర్చిన పాటలు త్వరలో రిలీజ్ కానున్నాయి. వచ్చే నెల మూవీ థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.