Chiranjeevi-Revanth Reddy : చిరంజీవి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి.. వైరల్ అవుతున్న వీడియో

  • February 4, 2024 / 12:41 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికైన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకి చిరంజీవి చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకి చిరంజీవిని ఎంపిక చేయడం జరిగింది. ఎటువంటి విపత్కర పరిస్థితులు సంభవించినా చిరు ఆయనకు తోచిన సాయం చేస్తూనే ఉన్నారు. కరోనా టైంలో ఆయన పేద కళాకారులను ఆదుకున్న తీరుని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక పద్మవిభూషణ్ అవార్డుకి చిరంజీవి ఎంపికవ్వడంతో కొద్దిరోజులుగా ఇండస్ట్రీ ఆయన్ని పెద్దలు కలిసి అభినందిస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం.

ఇండస్ట్రీకి చెందిన పెద్దలు మాత్రమే కాదు జర్నలిస్టులు.. అలాగే తోటి నటీనటులు అంతా చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ ఆయన్ని సత్కరించి వస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఈరోజు తన నివాసంలో విందు ఏర్పాటు చేసి రాజకీయ పెద్దలని ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. చిరు (Chiranjeevi) ఇంటికి వెళ్లి ఆయన్ని అభినందించడం జరిగింది.

అలాగే ఆయన కుటుంబ సభ్యులైన సురేఖ, రాంచరణ్, ఉపాసన వంటి వారితో కూడా కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం కేక్ కటింగ్ వేడుకలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెయిన్ గా రేవంత్ రెడ్డి – రాంచరణ్.. ని హత్తుకున్న విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ వేడుకకు సంబంధించిన వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

 

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus