Bigg Boss 5 Telugu: షణ్ముక్ సిరి ముందుకు వచ్చి ఎందుకు గుంజీళ్లు తీశాడు..?

  • November 5, 2021 / 10:50 AM IST

బిగ్ బాస్ హౌస్ లో సూపర్ హీరోస్ సూపర్ విలన్స్ అనే టాస్క్ ఫ్రెండ్స్ మద్యలో చిచ్చుపెట్టింది. టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచీ సిరికి, షణ్ముక్ కి ఇద్దరికీ ఏదో ఒక విషయంలో ఆర్గ్యూమెంట్ అవుతూనే ఉంది. మొదటి పింకీ తనని తోసిందని చెప్తున్నా కూడా సంచాలక్ అయిన షణ్ముక్ పట్టించుకోలేదు. అంతేకాదు, హౌస్ లో నిద్రపోయినందుకు కెప్టెన్ గా షణ్ముక్ సిరికి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. అందరి ముందు ఇండివెడ్యూవల్ గేమ్ ఆడు అంటూ మాట్లాడాడు. అలాగే, సిరిని దూరం పెట్టేందుకు కూడా ప్రయత్నించాడు. దీంతో సిరి బాగా ఎమోషనల్ అయిపోయింది.

పడుకునేముందు ఆర్గ్యూమెంట్ చేసినపుడు సిరి షణ్ముక్ ని నిలదీసే ప్రయత్నం చేసింది. అయినా కూడా షణ్ముక్ పట్టించుకోలేదు. దీంతో సిరి గార్డెన్ ఏరియాలోకి వచ్చి పడుకుంది. అక్కడికి వచ్చిన షణ్ముక్ సిరిని లోపలకి వచ్చి పడుకోమని బ్రతిమిలాడాడు. అయినా కూడా సిరి పట్టువీడలేదు. దీంతో సారీ చెప్పాడు షణ్ముక్. అంతేకాదు, అక్కడ గుంజీళ్లు తీసి మరీ సిరికి సారీ చెప్పాడు. అది సరిపోలేదంటూ అందరి ముందూ సారీ చెప్పమని సిరి అడిగింది. దీంతో అందరికీ వినిపించేలా సారీ చెప్పాడు షణ్ముక్. సిరి గట్టిగా హగ్ ఇచ్చేసరికి ఇక ఇక్కడితో ఇద్దరూ కలిసిపోయారనే అనుకున్నారు అందరూ.

కానీ, ఆటలో మజా అప్పుడే స్టార్ట్ అయ్యింది. తెల్లారి విలన్ గా నటిస్తూ హౌస్ మేట్స్ బట్టలు అన్నీ చిందర వందర చేసేసింది సిరి. దీంతో కెప్టెన్ గా షణ్ముక్ వాటిని సర్ధమని చెప్పాడు. చెయ్యి నొప్పిగా ఉందని తర్వాత సర్ధుతానని చెప్తూనే వాళ్లని సర్థుకోమని చెప్పింది సిరి. ఇక్కడే ఇద్దరికీ మాటామాటా పెరిగింది. ఇండివెడ్యువల్ గా గేమ్ ఆడు అని చెప్పి షణ్ముక్ మరోసారి మాట్లాడాడు. దీంతో సిరి నాకు తగిలిన దెబ్బలకంటే కూడా నీ మాటలే ఎక్కువగా హర్టింగ్ ఉన్నాయి అంటూ ఏడ్చేసింది.

ఇక ఈ టాస్క్ లో జెస్సీ కూడా షణ్ముక్ కి సలహాలు ఇచ్చాడు. నా గేమ్ నేను ఆడుతున్నాను అని, నచ్చకపోతే వరెస్ట్ పెర్ఫామర్ ఇమ్మని, లేదంటే నామినేట్ చేసేయమని సలహా ఇచ్చాడు షణ్ముక్. మొత్తానికి ఈటాస్క్ ఫ్రెండ్స్ ని విడగొట్టేలాగానే కనిపిస్తోంది. అదీ మేటర్.

[yop_poll id=”5″]

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus