Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 23, 2020 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!

‘ప్రేమిస్తే’ సినిమా ప్రేక్షకులకి ఇప్పటికీ ఎందుకు గుర్తుంది? అందులో ఎమోషన్, అంతకు ముందు చూపించిన ప్రేమకథ అంత సహజంగా ఉంటుంది మరి! ‘ప్రేమిస్తే’ అనే కాదు… చాలా ప్రేమకథల్లో పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి మధ్య ఏర్పడిన సహజమైన బంధమే ఉంటుంది. ఎమోషన్ కనెక్ట్ అయితే క్లాసిక్ అని అనిపించుకుంటాయి. లేదంటే మంచి ప్రయత్నంగా మిగులుతాయి. పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి కథకు వర్ణవివక్షను జోడించిన ‘కలర్ ఫొటో’ చూశాక ఏమనిపిస్తుంది? ఇది క్లాసిక్ సినిమానా? లేదంటే మంచి ప్రయత్నమా?

కథ: జయకృష్ణ (సుహాస్), దీప్తి ఇందుకూరి (చాందిని చౌదరి)ది మచిలీపట్నంలో ఓకే కాలేజీ. దీప్తి అందంగా, తెల్లగా ఉంటుంది. పైగా, పెద్దింటి అమ్మాయి. దీప్తి అన్నయ్య రామరాజు (సునీల్) ఎస్సై. జయకృష్ణ నల్లగా ఉంటాడు. ఉదయం నాలుగు ఇళ్లకు పాలు పోసి కాలేజీకి చదుకోవడానికి వస్తాడు. మంచి స్టూడెంట్. దీప్తితో ప్రేమలో పడతాడు. జయకృష్ణని ఆమె కూడా ప్రేమిస్తుంది. ఈ విషయం రామరాజుకి తెలుస్తుంది. చెల్లెల్ని విజయవాడ పంపిస్తాడు. ఇక్కడ మచిలీపట్నంలో జయకృష్ణను భయపెడతాడు. చెల్లెలికి అమెరికా సంబంధం చూస్తాడు. రామరాజు బెదిరింపులకు భయపడిన జయకృష్ణ, దీప్తి విడిపోతారా? ఎదురించి పెళ్లి చేసుకున్నారా? చివరికి ఏమైంది? అనేది కథ.

నటీనటుల పనితీరు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, హర్ష… కథలో ప్రధాన పాత్రలు పోషించారు. నలుగురూ తమ నటనతో ఆకట్టుకున్నారు. అందరి కంటే హర్ష, చాందినికి ఎక్కువ మార్కులు వేయవచ్చు. హర్ష సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశాడు. సైలెంట్ గా పంచ్ డైలాగ్స్ వేసి నవ్వించడంతో పాటు అవసరమైనప్పుడు సెంటిమెంట్ సీన్లు బాగా చేశాడు. చాందిని చౌదరి 1990ల కాలంలో నాటి అమ్మాయిలా కనిపించింది. చక్కగా నటించింది. సునీల్ చేయడం వలన పాత్రకు వెయిట్ పెరిగింది.సుహాస్ కి యాక్టింగ్ కంటే వాయిస్ ప్లస్ అని చెప్పుకోవాలి. ఎమోషనల్ సీన్లలో అతడి డైలాగ్ డెలివరీ బాగుంది. రెండు మూడు సన్నివేశాల్లో నవ్వించాడు. కానీ, ఎక్కువగా యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. సుహాస్ తండ్రి పాత్రలో తన పరిధి మేరకు ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ సుబ్బారావు నటించారు. మిగతా నటీనటులు పర్వాలేదు. నటన పరంగా సినిమాకి వంక పెట్టడానికి లేదు.

సాంకేతికవర్గం పనితీరు: ‘కలర్ ఫోటో’ కథేమీ కొత్తది కాదు. ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసినది. దానికి వర్ణ వివక్ష… కలర్ డిస్క్రిమినేషన్ యాడ్ చేశారు. హీరో నల్లగా ఉండటం వలన కొన్ని జోకులు పేలాయి. ఎమోషన్ కొంత వరకు వర్కవుట్ అయింది. కథ పాతదే అనుకుని సరిపెట్టుకున్నప్పటికీ… కథనం బాగుందా? అంటే అదీ లేదు. కథలో ప్రతి మలుపును ప్రేక్షకుడు ఊహించగలడు. అంతకంటే సినిమాకి మైనస్ ఏంటంటే… సినిమాలో ట్విస్టులు.

సెకండాఫ్ లో మరొకటి హీరోయిన్ ప్రేమకథను చెప్పిన తరువాత “సమంత కూడా ‘జాను’ సినిమాలో జరగని కథను జరిగినట్టు చెప్పి హ్యాపీ ఎండింగ్ ఇచ్చుకుంది కదా” అని అనిపిస్తుంది. ఆ హ్యాపీ ఎండింగ్ కూడా ‘నువ్వు నేను’ సినిమాలా ఉండటం మరో మైనస్. దాన్ని కవర్ చేయడానికి ‘మా అమెరికాలో రిలీజ్ కాలేదు’ అని మరో డైలాగ్. ఆ హ్యాపీ ఎండింగ్ తో సినిమా అయిపోయిందని అనుకుంటే పొరబాటే. ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. ‘ప్రేమిస్తే’ తరహాలో భారీ ఎమోషనల్ క్లైమాక్స్ ఇచ్చారు.

ఫస్టాఫ్ లో ప్రేమకథ హార్ట్ టచింగ్ గా ఉండి ఉంటే… ఎండింగ్ లో క్లైమాక్స్ బాగా కనెక్ట్ అయ్యి ఉండేది. తన వెంట పడుతున్నాడని, మంచోడని అబ్బాయితో మాట్లాడడానికి అమ్మాయి ఆసక్తి చూపించినట్టు… ప్రేమలో పడినట్టు ముందు చూపించారు. అమ్మాయి ప్రేమించడానికి అసలు కారణం చివర్లో కాకుండా ముందుగా చూపించి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ కూడా సూపర్ అని చెప్పలేం. ముందు చెప్పుకున్నట్టు ‘ప్రేమిస్తే’ టైపులో ఉంటుంది. ఇంకాస్త ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్లారని చెప్పవచ్చు.

రెగ్యులర్ రొటీన్ కథను కొంచెం కొత్తగా చూపించినది ఏదైనా ఉందంటే సందీప్ రాజ్ డైరెక్షన్, డైలాగ్స్. కొన్ని సీన్లలో స్పేస్ తీసుకుని మరీ మంచి మంచి విషయాలు చెప్పాలని చూశాడు. ఆరిస్టుల నుండి బెటర్ పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. స్వచ్ఛమైన ప్రేమకథలో ద్వందార్థపు వినోదం లేకుండా అతడు చూసుకుని ఉంటే బాగుంది. ఫైట్ తరువాత అంతకంటే మంచి కామెడీ సీన్ రాసుకుని ఉంటే దర్శకుడిగా రెస్పెక్ట్ పొందేవాడు. రెగ్యులర్ సీన్లు, స్టోరీని మ్యూజిక్ తో కాల భైరవ, సినిమాటోగ్రఫీతో వెంకట్ మరో మెట్టు ఎక్కించారు. వాళ్లిద్దరూ సినిమాకి ప్లస్ అయ్యారు. ఎడిటింగ్ లో ల్యాగ్ సీన్లు లేపేస్తే బాగుండేది.

విశ్లేషణ: కలర్ డిస్క్రిమినేషన్ బ్యాక్ డ్రాప్ లో చెప్పిన బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి కథే ‘కలర్ ఫోటో’. దీనికి పెర్ఫార్మన్స్ లు, డైలాగ్స్, సాంగ్స్ యాడ్ అవ్వడంతో మంచి ప్రయత్నంగా మిగిలింది. ప్రేమ కథను ముందు నుండి మరింత స్ట్రాంగ్ గా చూపించి ఉంటే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేది. అయినా ఎమోషన్ కొన్ని సీన్లలో వర్కవుట్ అయింది.

రేటింగ్: 2.5/5
ప్లాట్ ఫామ్: ఆహా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BennyMuppaneni
  • #Chandini Chowdary
  • #Colour Photo
  • #Kaala Bhairava
  • #Sai Rajesh

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

26 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

38 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version